ఇంటి ఫుడ్ కావాలంటే.. ‘స్విగ్గీ డైలీ’క్లిక్ చేయండి

By rajesh yFirst Published Jun 4, 2019, 10:13 AM IST
Highlights

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన వినియోగదారుల కోసం మరో వసతి అందుబాటులోకి తెచ్చింది. ఇంటి ఫుడ్ కావాలంటే స్విగ్గి డైలీ యాప్ క్లిక్ చేస్తే చాలు. మీ ఇంటి వాతావరణంలో తయారు చేసిన ఫుడ్ అందుబాటులో ఉంటుంది.

గుర్గావ్‌: మన స్నేహితులు, తెలిసిన వారిలో కొందరికి కేవలం ఇంటి భోజనం తప్ప ఇతరత్రా ప్రదేశాల్లో వండినవి తినడం ఇష్టం ఉండదు. అలాంటి వారి కోసం ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ‘స్విగ్గీ డైలీ’ పేరుతో నూతన యాప్‌ అందుబాటులోకి తెచ్చింది.

ఈ యాప్‌ ద్వారా పూర్తిగా ఇంటి వాతావరణంలో తయారుచేసిన భోజనం ‘స్విగ్గీ’ కస్టమర్లకు అందించనుంది. ప్రస్తుతం గుర్గావ్‌లో ప్రారంభించిన ఈ ‘స్విగ్గీ డైలీ’ సేవలు త్వరలోనే బెంగళూరు, ముంబై నగరాలకు విస్తరించనున్నట్లు ఈ ఫుడ్‌ స్టార్టప్‌ తెలిపింది.

ఈ యాప్‌లో కస్టమర్లకు మరో సౌకర్యం కూడా ఉంది. సందర్భానుసారంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ముందే మన ఆర్డర్‌ షెడ్యూల్‌ చేసుకోవచ్చు. అంతేకాదు వారం, నెలసరి చందా చెల్లించి ఆర్డర్‌ చేసుకొనే విధానం కూడా స్విగ్గీ డైలీ యాప్ అందుబాటులోకి తెచ్చింది.

‘సరసమైన, నాణ్యతతో కూడిన రోజువారీ భోజనానికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ గిరాకీని అందుకొనేందుకు ఆర్గనైజ్డ్‌ వెండర్స్‌, హోం చెఫ్స్‌ సాయంతో భోజనం ‘స్విగ్గీ డైలీ’ ద్వారా అందిస్తున్నాం’ అంటూ సంస్థ సీఈవో శ్రీహర్ష పేర్కొన్నారు. 

భోజనం విషయంలో ప్రముఖ వెండర్స్‌ సుమితాస్‌ ఫుడ్‌ ప్లానెట్‌, అహ్మద్స్‌ కిచెన్‌, సాచీ జైన్‌, హోమ్లీ, లంచ్లీ, ఫిగ్‌, ఐదాబా, కెలోరీస్మార్ట్‌, అల్పాహారం కోసం డయల్‌ ఎ మీల్, డెయిలీ మీల్స్‌.ఇన్‌ ద్వారా నాణ్యమైన భోజనం, అల్పాహారం అందిస్తామని స్విగ్గీ పేర్కొంది.

ఎంటర్ ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్ ఎట్ స్విగ్గీ అలోక్ జైన్ మాట్లాడుతూ ‘భారతదేశంలో డైలీ మీల్ సబ్ స్క్రిప్షన్ మార్కెట్ పూర్తిగా అసంఘటిత రంగంలో మల్టీఫుల్ టిపిన్ సెంటర్లు, హోమ్ చెఫ్స్ సారథ్యంలో స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. లోకల్ చాట్ గ్రూప్స్, నోటి మాటతో నడుస్తున్నాయి’ అని తెలిపారు. 

‘దేశంలో ఫస్ట్ హోం స్టైల్ హైపర్ లోకల్ ఫుడ్ సబ్ స్క్రిప్షన్ సర్వీసు డైలీ అందుబాటులో ఉంది. రుచి, శుచితో ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో డిస్కవరీ, ఫ్లెగ్జిబిలిటీ, టేస్ట్ వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని అలోక్ జైన్ చెప్పారు. 

click me!