Stocks to Sell: ఈ స్టాక్స్ మీ పోర్ట్ ఫోలియోలో ఉన్నాయా..బ్రోకరేజీలు SELL చేయమంటున్నాయి..ఆ స్టాక్స్ ఏవో చూద్దాం

By Krishna AdithyaFirst Published May 11, 2023, 5:41 PM IST
Highlights

Q4 రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుంది. కంపెనీల త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా వస్తున్నాయి. చాలా వరకు అంచనాల ప్రకారం వస్తున్నాయి. చాలా కంపెనీలు కొంత ఒత్తిడిని కూడా చూశాయి. ప్రస్తుతం, నిపుణులు బ్రోకరేజ్ సంస్థలు కూడా త్రైమాసిక ఫలితాల నుండి ఆ కంపెనీ  దాని స్టాక్‌కు సంబంధించిన ఔట్‌లుక్‌ను అంచనా వేస్తున్నారు.

ఔట్‌లుక్ బలహీనంగా కనిపిస్తున్న కొన్ని స్టాక్‌ల విషయంలో బ్రోకరేజీలు సెల్ చేయమని రికమెండ్ చేస్తున్నాయి. ఈ స్టాక్స్ వెనుక వాల్యుయేషన్, లాభం లేదా మార్జిన్‌పై ఒత్తిడి ఉంది. బ్రోకరేజ్ హౌస్‌లు ఈ స్టాక్‌లకు Sell రేటింగ్‌లు ఇస్తున్నాయి, అయితే వాటి టార్గెట్ ధరలు, ప్రస్తుత ధర కంటే తక్కువగా ఉన్నాయి. అలాంటి నాలుగు షేర్ల గురించి తెలుసుకుందాం. 

MRF

బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ దేశంలోని అత్యంత ఖరీదైన స్టాక్ MRFకి సెల్ రేటింగ్ ఇచ్చారు. స్టాక్‌కు రూ.75400 టార్గెట్ ఇవ్వగా, ప్రస్తుత ధర రూ.97201గా ఉంది. అంటే స్టాక్‌లో 22 శాతం తగ్గుదల కనిపించవచ్చు. తోటి కంపెనీలతో పోలిస్తే కంపెనీ పనితీరు తక్కువగా ఉందని బ్రోకరేజ్ చెబుతోంది. గత కొన్ని సంవత్సరాలలో, రంగంలో MRF  స్థానం బలహీనతను చూపింది. FY2025 నాటికి దాని RoE 10.5 శాతంకి చేరుకునే అవకాశం ఉన్నందున, రాబోయే 2 సంవత్సరాలలో కంపెనీ రాబడి నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

Britannia Industries

బ్రోకరేజ్ హౌస్ హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రూ. 4,150 లక్ష్యంతో స్టాక్‌పై తగ్గింపు రేటింగ్ ఇచ్చింది. కాగా ప్రస్తుత ధర రూ.4650. బ్రిటానియా  Q4FY23 నికర ఆదాయం 11% శాతంపెరిగింది, ఇది 14% అంచనాల కంటే తక్కువగా ఉంది. వాల్యూమ్ గ్రోత్ కూడా కొంచెం తగ్గింది. అయినప్పటికీ, మార్కెట్ లీడ్ కొనసాగుతోంది. దీని వెనుక పంపిణీ, పోర్ట్‌ఫోలియో ఆవిష్కరణ, ఖర్చు సామర్థ్యం  మార్కెటింగ్ కార్యక్రమాలు ప్రధాన కారణాలు. వాల్యుయేషన్ పరంగా కంపెనీ పెరుగుతుందనే ఆశ లేదు. అందుకే SELL రేటింగ్ ఇచ్చింది. 

LUPIN

బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ఫార్మా స్టాక్ లుపిన్‌పై సెల్ రేటింగ్ ఇచ్చింది. స్టాక్‌కు రూ.740 టార్గెట్ ఇవ్వగా, ప్రస్తుత ధర రూ.750గా ఉంది. అంటే షేరులో 15 శాతం పతనం కనిపించవచ్చు. నాల్గవ త్రైమాసికంలో అన్ని విభాగాల్లో అమ్మకాలు పెరగడం వల్ల కంపెనీ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరిచిందని బ్రోకరేజ్ చెబుతోంది. అంతే కాదు ఈ కంపెనీ PLI పథకం  ప్రయోజనాన్ని కూడా పొందింది. FY24 - FY25 సమయంలో కంపెనీ ఆదాయాల్లో 2 నుంచి  4%  వృద్ధిని చూడవచ్చు. API/యూరోప్ విభాగంలో Outlook మెరుగ్గా ఉంది. గత మూడు త్రైమాసికాలుగా లాభదాయకత మెరుగుపడుతోంది. ప్రస్తుత వాల్యుయేషన్ స్టాక్‌లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే మంచిదని బ్రోకరేజీ సూచిస్తోంది. 

Syngene

బ్రోకరేజ్ హాస్ ఎస్ సెక్యూరిటీస్ సింజీన్ స్టాక్‌పై SELL రేటింగ్‌ను కలిగి ఇస్తోంది. స్టాక్‌కు రూ.560 టార్గెట్ ఇవ్వగా, ప్రస్తుత ధర రూ.700గా ఉంది. అటువంటి పరిస్థితిలో, స్టాక్‌లో 16 నుండి 17 శాతం బలహీనతను చూడవచ్చు. గత 4 సంవత్సరాల్లో సామర్థ్యంలో 18 శాతం వృద్ధి నమోదైంది. అయితే  ఆపరేటింగ్ ఖర్చులు పెరుగుదుగ కొనసాగుతుందని బ్రోకరేజ్ హౌస్ చెబుతోంది. CC టర్మ్‌లో ఆదాయంలో 10-11% వృద్ధి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆపరేటింగ్ ఖర్చు ఇప్పటికీ మార్క్‌కు చేరుకోనందున బ్రోకరేజ్ హౌస్ FY24/25 కోసం మార్జిన్ అంచనాలను 10-15% తగ్గించింది.

click me!