భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్, అతని కుటుంబ సభ్యులు కేసు నమోదు.. కంపెనీ ఫిర్యాదు చేయడం చర్యలు..

By Sumanth KanukulaFirst Published May 11, 2023, 3:53 PM IST
Highlights

భారత్‌పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌పై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. అష్నీర్ గ్రోవర్‌తో పాటు ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్, కుటుంబ సభ్యులు దీపక్ గుప్తా, సురేష్ జైన్, శ్వేతాంక్ జైన్‌లపై కూడా కేసు నమోదైంది.

భారత్‌పే మాజీ ఎండీ, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌పై ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. అష్నీర్ గ్రోవర్‌తో పాటు ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్, కుటుంబ సభ్యులు దీపక్ గుప్తా, సురేష్ జైన్, శ్వేతాంక్ జైన్‌లపై కూడా కేసు నమోదైంది. 81 కోట్ల మోసానికి సంబంధించి ఫిన్‌టెక్ యునికార్న్ భారత్‌పే ఫిర్యాదు  చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తే వారిపై ఐపీసీలోని ఎనిమిది సెక్షన్‌ల కింద ఫైల్ చేయబడింది. ఇందులో 406 నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, 420 (మోసం, నిజాయితీ లేకపోవడం), 467, 468 (ఫోర్జరీ) సెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసులో నేరం రుజువైతే.. గ్రోవర్, మాధురి, ఇతరులకు 10 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష వరకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 

అక్రమ చెల్లింపుల ద్వారా గ్రోవర్, అతని కుటుంబం సుమారు 81.3 కోట్ల రూపాయల నష్టం కలిగించారని భారత్‌పే ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని భారత్ పే స్వాగతించింది. ‘‘గత 15 నెలలుగా కంపెనీ, బోర్డు, ఉద్యోగులకు వ్యతిరేకంగా గ్రోవర్ నడుపుతున్న దుర్మార్గపు, హానికరమైన ప్రచారాన్ని కంపెనీ ఎదుర్కొంటోంది. ఎఫ్‌ఐఆర్ నమోదు సరైన దిశలో ఒక అడుగు. ఇది వ్యక్తిగత  లాభాల కోసం ా కుటుంబం చేసిన వివిధ అనుమానాస్పద లావాదేవీలను వెలికితీస్తుంది’’ అని భారత్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.


ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో దర్యాప్తు సంస్థలకు నేరంపై లోతుగా దర్యాప్తు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది. ‘‘మన దేశం న్యాయ, చట్ట అమలు వ్యవస్థలపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కేసు తార్కిక ముగింపుకు చేరుకుంటుందని ఆశాభావంతో ఉన్నాము. మేము అధికారులకు సాధ్యమైన అన్ని సహకారాన్ని అందజేస్తాము’’ భారత్‌పై పేర్కొంది. 

click me!