stock market:స్టాక్ మార్కెట్ పతనం.. సెన్సెక్స్ 490 పాయింట్లు డౌన్.. 17200 దిగువకు నిఫ్టీ

Ashok Kumar   | Asianet News
Published : Mar 21, 2022, 03:24 PM IST
stock market:స్టాక్ మార్కెట్  పతనం.. సెన్సెక్స్ 490 పాయింట్లు డౌన్..  17200 దిగువకు నిఫ్టీ

సారాంశం

నేడు తొలి ట్రేడింగ్ రోజూన సోమవారం స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్ తో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 58,030 వద్ద ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 46 పాయింట్ల లాభంతో 17,333 వద్ద ప్రారంభమైంది. అయితే, ఈ జోరు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 488 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతోంది.

మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య ఈ వారం మొదటి ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ గ్రీన్ మార్క్‌తో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30-షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ 166.33 పాయింట్లు అంటే 0.29 శాతం పెరిగి 58030 వద్ద ప్రారంభమైంది, అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 46.50 పాయింట్లు అంటే 0.27 శాతం 17333 స్థాయి వద్ద ప్రారంభమైంది. అయితే ఈ జోరు ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్ 488 పాయింట్ల నష్టంతో 57,376 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 140 పాయింట్లు పతనమై 17,147 స్థాయికి చేరుకుంది. 

గురువారం 1000 పాయింట్లు జంప్ చేసిన సెన్సెక్స్ 
షేర్ మార్కెట్ ప్రారంభంతో దాదాపు 1633 షేర్లు లాభపడగా, 602 షేర్లు క్షీణించగా, 124 షేర్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. గత వారం స్టాక్ మార్కెట్ వరుసగా రెండు రోజులు లాభాలతో ముగియడం గమనార్హం. గురువారం స్టాక్ మార్కెట్‌లో హోలీ పండుగ సందడి నెలకొంది. హోలికా దహన్ రోజున, స్టాక్ మార్కెట్  రెండు ఇండెక్స్‌లు గ్రీన్ మార్క్‌లో ప్రారంభమయ్యాయి అలాగే రోజంతా లాభాలతో ట్రేడింగ్ చేసి చివరకు బలంగా ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 1047 పాయింట్లు లేదా 1.84 శాతం పెరిగి 57,864 వద్ద ముగియగా, ఎన్‌ఎఇ నిఫ్టీ 311 పాయింట్లు లేదా 1.90 శాతం పెరిగి 17,287 వద్ద ముగిసింది.

ఒక నివేదిక ప్రకారం మార్చి 17తో ముగిసిన వారంలో స్టాక్ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. హోలీ పండుగ సెలవుల కారణంగా ఇతర వారాలతో పోలిస్తే ఈ వారం తక్కువగా ఉంది. నివేదిక ప్రకారం, షేర్ మార్కెట్‌లో నాలుగు శాతం జంప్ చేసింది. 60 స్మాల్‌ క్యాప్‌లు 10 నుంచి 25 శాతం వరకు పెరిగాయని పేర్కొంది. నివేదిక ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 10 వారాల తర్వాత నికర కొనుగోలుదారులుగా కనిపించారు. 

రెండు సూచీల పరిస్థితి
గత వారం రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరల పతనం ప్రభావం కనిపించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,313.63 పాయింట్లు (4.16 శాతం) లాభంతో 57,863.93 వద్ద, నిఫ్టీ 50 656.6 పాయింట్లు (3.94 శాతం) లాభంతో 17,287.05 వద్ద ముగిశాయి. ఇదిలా ఉండగా, నిఫ్టీ ఆటో అండ్ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 5 శాతానికి పైగా, రియల్టీ ఇండెక్స్ 4.7 శాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బ్రాడర్ ఇండెక్స్ గురించి మాట్లాడితే, బిఎస్‌ఇ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఒక్కొక్కటి రెండు శాతం లాభపడగా, లార్జ్ క్యాప్ ఇండెక్స్ నాలుగు శాతం లాభపడింది.

ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో 
ఇదిలా ఉండగా, సోమవారం చాలా వరకు ఆసియా మార్కెట్లు బలమైన ప్రదర్శన చేస్తున్నాయి. SGX నిఫ్టీ 100 పాయింట్లకు పైగా ట్రేడవుతోంది. డౌ ఫ్యూచర్ ఉదయం ఫ్లాట్‌గా కనిపిస్తోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ 274 పాయింట్లు లాభపడింది. S&P 500 1.17 శాతం లాభపడింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే