
ఈ వారం స్టాక్ రికమెండేషన్స్
పవర్‌గ్రిడ్ (PowerGrid)
ఈ షేరు మళ్లీ పుంజుకుంటూ కన్సాలిడేషన్ దశ నుంచి అవుట్‌బ్రేక్ ట్రై చేస్తోంది. రూ.250 వద్ద మద్దతు తీసుకుని గత శుక్రవారం రూ.304 వద్ద ముగిసింది. ప్రస్తుతం రూ.300 దగ్గర ఎంట్రీ తీసుకుని రూ.322-330 టార్గెట్లను టార్గెట్ చేయవచ్చు. స్టాప్‌లాస్: ₹292.
గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ (Gujarat Gas)
ఇటీవల బేస్ నిర్మాణంలో ఉన్న ఈ షేరు, రూ.380 స్థాయిలో స్థిరంగా ఉంది. శుక్రవారం ముగింపు ధర ₹428. ఈ కౌంటర్‌లో ₹410-420 రేంజ్‌లో ఎంట్రీ తీసుకుని ₹490 టార్గెట్‌తో ట్రేడ్ చేయొచ్చు. స్టాప్‌లాస్: ₹400.
పతంజలి ఫుడ్స్ (Patanjali Foods)
ఈ షేరు నష్టాల మార్కెట్లో కూడా బలంగా ట్రేడ్ అవుతోంది. డార్వాస్ బాక్స్ ప్యాటర్న్‌లో రూ.1,800 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం ₹1,850 వద్ద ఎంట్రీ తీసుకుని ₹2,150 టార్గెట్‌గా పెట్టుకోవచ్చు. స్టాప్‌లాస్: ₹1,810.
లారస్ ల్యాబ్స్ (Laurus Labs)
అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం రేంజ్‌బౌండ్ మోడ్‌లో ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ పెరుగుతుండటం శుభసూచకం. ₹600 వద్ద ఎంట్రీ తీసుకుని ₹655 టార్గెట్‌తో పెట్టుబడి పెట్టొచ్చు. స్టాప్‌లాస్: ₹585.
జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ (Jindal Stainless Steel)
డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ షేరు ప్రస్తుతం స్టెబిలిటీ చూపుతోంది. వాల్యూమ్ కాస్త తగ్గినా, తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ₹530-540 వద్ద పొజిషన్ తీసుకుని ₹610 టార్గెట్‌గా పెట్టుకోవచ్చు. స్టాప్‌లాస్: ₹520.
(గమనిక: నిపుణులు వెల్లడించిన అంచనాలను మాత్రమే మేం సూచించాం. మార్కెట్ లో పెట్టబడులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకొనే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం)