స్టాక్ మార్కెట్ నేడు రికార్డుల జోరు.. సెన్సెక్స్ 57 వేల పైకి, మొదటిసారి 16900 దాటిన నిఫ్టీ..

By asianet news teluguFirst Published Aug 30, 2021, 4:49 PM IST
Highlights

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ ఇండెక్స్ లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూలత, డాలర్ తో రూపాయి బలపడడం, ఎఫ్‌డీఐల వెల్లువ మధ్య స్టాక్ మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయి.

గ్లోబల్ మార్కెట్ల నుండి సానుకూల సూచనల మధ్య స్టాక్ మార్కెట్ నేడు సోమవారం ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. రోజంతా ఒడిదుడుకుల తరువాత స్టాక్ మార్కెట్ చివరకి  లాభాలతో ముగిసింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 765.04 పాయింట్ల లాభంతో (1.36 శాతం) 56,889.76 వద్ద ముగియగా మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 225.85 పాయింట్ల (1.35 శాతం) లాభంతో 16,931.05 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 56958.27, నిఫ్టీ 16,951.50 రికార్డు స్థాయిని తాకింది. గత వారం 30-షేర్ల బి‌ఎస్‌ఈ సెన్సెక్స్ 795.40 పాయింట్లు (1.43 శాతం) లాభపడింది.  

విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) రూ .1.28 లక్షల కోట్లు దాటాయి, దీంతో దేశీయ మార్కెట్‌లో విజృంభణకు దారితీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడింది, అలాగే ఇన్వెస్టర్లలో కరోనా భయం వాక్సిన్ కారణంగా తగ్గినట్లు  కనిపిస్తోంది. అంతేకాకుండా జి‌డి‌పి, ఆటో అమ్మకాల  మంచి సంకేతాల అంచనాలు కూడా మార్కెట్లో పెరిగాయి. 

విశ్లేషకులు ప్రకారం ఈ వారం మాక్రో ఎకనామిక్ డేటా, ఆటో అమ్మకాల గణాంకాలు, దేశీయ స్టాక్ మార్కెట్ ధోరణి స్టాక్ మార్కెట్ ని నిర్దేశిస్తాయి.  మార్కెట్ల దిశ రూపాయి అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధోరణిపై ఆధారపడి ఉంటుంది. భారతీ ఎయిర్‌టెల్, దివిస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా షేర్లు   లాభాలతో ముగిశాయి. మరోవైపు, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు నష్టాలలో ముగిశాయి.  

also read బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. నేడు హైదరాబాద్‌లో పసిడి ధర ఎంత పెరిగిందంటే ?

 సెక్టోరల్ ఇండెక్స్‌ని చూస్తే నేడు ఐటీ మినహా అన్ని రంగాలు లాభాలలో  ముగిశాయి. అయితే ఇందులో  ఎఫ్‌ఎం‌సి‌జి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకులు, మెటల్స్, పి‌ఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, ఆటో అండ్ మీడియా ఉన్నాయి. 

  స్టాక్ మార్కెట్ నేడు ఉదయం లాభాలతో  ఓపెన్ అయ్యింది. సెన్సెక్స్ 321.99 పాయింట్ల లాభంతో (0.57 శాతం) 56,446.71 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 103.30 పాయింట్ల (0.62 శాతం) లాభంతో రికార్డు స్థాయిలో 16,808.50 వద్ద ప్రారంభమైంది. 

 స్టాక్ మార్కెట్ గత వారం శుక్రవారం కూడా అత్యధిక స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 56,124.72 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 68.30 పాయింట్లు పెరిగి 16,705.20 రికార్డు స్థాయిలో ముగిసింది. 

click me!