42వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్... మార్కెట్ పై ప్రభావం చూపనున్న సుప్రీం తీర్పు

By Sandra Ashok KumarFirst Published Jan 17, 2020, 12:26 PM IST
Highlights

సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. దీనికి తోడు అమెరికా  - చైనాల మధ్య తొలి దశ వ్యాపార ఒప్పందం కుదరడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సైతం జీతివత కాల గరిష్టస్థాయిలను తాకాయి.

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం భారత్ లో 7,100వేల కోట్ల పెట్టుబడులు , అమెజాన్ పై భారత వర్తక వ్యాపారుల ఆగ్రహం స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. పైగా సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. దీనికి తోడు అమెరికా  - చైనాల మధ్య తొలి దశ వ్యాపార ఒప్పందం కుదరడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సైతం జీతివత కాల గరిష్టస్థాయిలను తాకాయి.

also read గూగుల్‌ పేరెంట్ కంపనీ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత

 సెన్సెక్స్ 42,059 పాయింట్లు, నిఫ్టీ 12,389ని తాకాయి. ఎస్ఎస్ ఈ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు కావడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి.  సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల నుంచి 42,000 పాయింట్లకు చేరడానికి 36 ట్రేడింగ్‌ సెషన్లు పట్టింది. ఈ 36 ట్రేడింగ్‌ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వృద్ధి జోరు పెంచడానికి ప్రభుత్వం చర్యలు,  బడ్జెట్ సమావేశాల వల్ల అంచనాలు ఈ లాభాలకు కారణాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

అయితే అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ( ఏజీఆర్ ) పిటిషన్ పై సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ఏజీఆర్ పిటిషన్ పై సుప్రీం విచారణ నేపథ్యంలో తీర్పు ప్రభావం మార్కెట్ పై పడనుంది. దీంతో ప్రారంభంలోనే లాభాల బాట పట్టిన మార్కెట్లు..రానురాను డౌన్ ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రారంభంలోనే  105 పాయింట్లతో సెన్సెక్స్ 42,040.80 వద్ద  , నిఫ్టీ 23 పాయింట్లతో  12,350.65పాయింట్లతో ట్రేడ్ అయ్యాయి. ర్యాలీస్ ఇండియా, ఇండోస్టార్ క్యాపిటల్, వినాటీ ఆర్గానిక్స్, ధనుక అగ్రిటెక్, పరాగ్ మిల్క్ ఫుడ్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, శంకరా బిల్డ్, అదానీ గ్రీన్, సెంచరీ ప్లే, ఇమామీ, వార్కో ఇంజనీర్, జేకే టైర్, బీఏఎస్ ఎఫ్ ఇండియా, స్టేర్ లైట్ టెక్, ఎంఆర్ఎఫ్, బజాజ్ ఎలక్ట్రికల్, మోతిల్ ఓస్వాల్, భారతీ ఎయిర్ టెల్, క్రామ్ టోన్ స్టాక్స్ లాభాల్లో నడుస్తున్నాయి.

వొడాఫోన్, భారతీ ఇన్ఫ్రా, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, డిష్ మాన్ కార్బోజెన్ , కర్నాటక బ్యాక్, ఐనాక్స్ విడ్, ఇండియా బుల్స్, సన్ టెక్ రియాలిటీ, ఎస్ బ్యాంక్, ఇండియా ఎనర్జీ, ఐటీడీసీ, సుప్రజీత్ , ఐటీడీసీ, సుప్రజిత్ ఇంజినీర్, నెట్ వర్క్ 18 మీడియా, జీన్ఎఫ్ సీ, గాయాత్రీ ప్రాజెక్ట్స్, ఐడీఎఫ్ సీ  ఫస్ట్ బ్యాంక్, సీపీసీఎల్, ఐడీఎఫ్ సీ స్టాక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్ 41,965 పాయింట్లు, నిఫ్టీ 12,363 పాయింట్లతో కొనసాగుతున్నాయి.

also read స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు


 ఈ ఏడాది సెన్సెక్స్‌  44,500 పాయింట్లకు ఎగబాకుంతుంది !

ఆర్థిక వ్యవస్థ మందగమనం, వినియోగం  నామమాత్రగానే ఉండటం, లిక్విడిటీ... తదితర సమస్యలున్నప్పటికీ, స్టాక్‌ మార్కెట్‌ పెరగగలదని వివరించింది. ప్రత్యామ్నాయ మదుపు అవకాశాలు అందుబాటులో లేకపోవడంతో దేశీయ పొదుపులు స్టాక్‌ మార్కెట్లోకి వస్తాయని ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ బీఎన్ పీ పారిబా తెలిపింది.

దీంతో ఈ ఏడాది సెన్సెక్స్ 9శాతం లాభపడి..డిసెంబర్ కల్లా 44,500పాయింట్లకు ఎగబాగుతుందని తెలిపింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వం బడ్జెట్లో తీసుకోనున్న చర్యలు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను తగ్గించకపోవడం... ఇవన్నీ మార్కెట్‌కు రిస్క్‌ అంశాలని ఆయన భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం 7 శాతానికి మించి పెరిగిపోవడంతో మరో ఆరు నెలల వరకూ ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని బీఎన్ పీ పారిబా అంచనా వేస్తోంది.   

click me!