గ్లోబల్ మార్కెట్ నుండి మిశ్రమ ధోరణులను అనుసరించి, ఫెడ్ చీఫ్ ప్రసంగానికి ముందు వారంలో చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా 120 పాయింట్ల క్షీణతను నమోదు చేసింది.
ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో రెండు కూడా నష్టాల్లో ముగిశాయి నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 19250 సమీపంలో ముగిసింది. నేడు మార్కెట్‌లో దాదాపు అన్ని రంగాల్లో నష్టాలు నమోదు అయ్యాయి. నిఫ్టీలో బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ సూచీలు రెడ్ మార్క్‌లో ముగిశాయి.ప్రస్తుతం సెన్సెక్స్ 366 పాయింట్ల బలహీనతతో 64,887 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 19,266 వద్ద ముగిసింది. హె హలోవీవెయిట్ స్టాక్స్‌లో అమ్మకాలు కనిపించాయి. ఈరోజు సెన్సెక్స్ 30కి చెందిన 23 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్‌లో BAJFINANCE, ASIANPAINT, BHARTIARTL, TITAN, ICICIBANK చేర్చబడ్డాయి. టాప్ లూజర్‌లలో INDUSINDBK, JSWSTEEL, LT, ULTRACEMCO, JIOFIN, POWERGRID ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ ఎట్టకేలకు నేటి ట్రేడింగ్‌లో లాభపడింది. వరుసగా 4 ట్రేడింగ్ సెషన్లలో 5 శాతం లోయర్ సర్క్యూట్ తర్వాత నేటి ట్రేడింగ్ లో దాదాపు 5 శాతం లాభపడి రూ.224కి చేరుకుంది. గురువారం ఈ షేరు రూ.213 వద్ద ముగిసింది. ప్రస్తుతం, స్టాక్‌లో 5 శాతం పెరుగుదల తర్వాత, జియో ఫైనాన్షియల్ మార్కెట్ క్యాప్ రూ. 1,39,772.25 కోట్లకు దిగజారింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం పేటీఎం ప్రమోటర్ యాంట్‌ఫిన్ ఆగస్టు 25న బ్లాక్ డీల్ ద్వారా, Paytmలో 3.6 శాతం వాటా లేదా 23 మిలియన్ షేర్లను విక్రయించే అవకాశం ఉంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ 3 సంవత్సరాల పాటు తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్‌ను నియమించింది. 'ఇన్ఫోసిస్ డిజిటల్ ఇన్నోవేషన్' బ్రాండ్‌తో నాదల్ 3 సంవత్సరాల పాటు అంబాసిడర్‌గా ఉంటారని కంపెనీ తెలిపింది. నాదల్ డిజిటల్ సర్వీస్ కంపెనీతో భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి.