
స్టాక్ మార్కెట్ నేడు మంచి వృద్ధిని చూస్తోంది. ఫెడరల్ రిజర్వ్ (US Fed) వడ్డీ పెంపు నిర్ణయాల తర్వాత, గ్లోబల్ మార్కెట్ల నుంచి మంచి సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ జంప్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లో మధ్యాహ్నం 12.20 గంటలకు సెన్సెక్స్ 1,050 పాయింట్ల లాభంతో ట్రేడవుతోండగా, నిఫ్టీ కూడా 311 పాయింట్ల లాభంతో 17,286 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ఈరోజు మార్కెట్లలో ట్రేడింగ్ మంచి ఊపుతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 800 పాయింట్ల జంప్‌తో 57,620 స్థాయి వద్ద ప్రారంభమైంది, నిఫ్టీ 17,200 పాయింట్లను తాకి ప్రారంభమైంది. ప్రీ-ఓపెనింగ్‌లోనూ సెన్సెక్స్ 803.63 పాయింట్లు లేదా 1.41 శాతం జంప్‌తో 57,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 227 పాయింట్ల జంప్ తర్వాత 17202 దాటింది.
బ్యాంక్ నిఫ్టీలో భారీ పెరుగుదల
బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మంచి బౌన్స్‌తో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 షేర్లు గ్రీన్ మార్క్‌తో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 700 పాయింట్లు అంటే 2 శాతం జంప్‌తో 36,445 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఎగువ స్థాయిలలో నిరంతరం మద్దతు తీసుకుంటోంది.
సెక్టోరల్ ఇండెక్స్ లలో లాభాలు
మార్కెట్‌లోని సెక్టోరల్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, అన్ని సూచీలు బుల్లిష్‌నెస్‌లో గ్రీన్ మార్క్‌తో ట్రేడవుతున్నాయి. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అత్యధికంగా 2 శాతం పెరుగుదల కనిపించింది మరియు అది పెరుగుతోంది. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్‌లో కూడా బలమైన పెరుగుదల ఉంది. పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌తో పాటు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి.
మార్కెట్లకు బలాన్ని ఇస్తున్న ఫ్యాక్టర్స్ ఇవే..
లిఖిత చేప, Senior Research Analyst, Capitalvia Global Research తెలిపిన వివరాల ప్రకారం, సెక్టార్‌ల పరంగా చూస్తే, అంతటా లాభాలు హెడ్‌లైన్ సూచీలను పెంచాయి. ఆర్థిక, IT, చమురు, గ్యాస్ స్టాక్‌లు సూచీలను ముందుండి నడిపిస్తున్నాయి. ఈరోజు బుధవారం అర్థరాత్రి US ఫెడరల్ రిజర్వ్ మూడు సంవత్సరాలలో మొదటి వడ్డీ రేటు పెంపు ప్రకటన తర్వాత గ్లోబల్ మార్కెట్లు పెరగడంతో మార్కెట్లు మరో గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో తమ అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగించవచ్చని భావిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగితే మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి పోతాయనే అంచనాలు తారుమారు అవ్వడంతో పాటు. మార్కెట్ చూపిస్తున్న జోరు ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఫిబ్రవరి 2022లో ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు మొత్తం 5.8 బిలియన్ల డాలర్లు ఉంది. ఫిబ్రవరి 2021 నుండి 2.3 రెట్లు (2.5 బిలియన్) జనవరి 2022లో పెట్టుబడుల కంటే 24 శాతం ఎక్కువ (4.6 బిలియన్) అని ప్రైవేట్ నివేదిక ద్వారా వ్యాపారులు ప్రోత్సాహం పొందుతున్నారు.
US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి భవిష్యత్తులో పెంపుదల అవసరమనే సూచనలతో పెట్టుబడిదారుల ప్రారంభ భయాలను తగ్గించింది. వాల్ స్ట్రీట్ పెరుగుదలతో గురువారం ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.