గుజరాత్ ఎన్నికల ఫలితాల్లోనూ స్టాక్ మార్కెట్లో కనిపించని ఉత్సాహం, స్వల్ప లాభాల్లో మార్కెట్లు..

By Krishna AdithyaFirst Published Dec 8, 2022, 11:11 AM IST
Highlights

గుజరాత్ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి పాజిటివ్ గానే ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. మార్కెట్లు పాజిటివ్ గానే ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లు నేడు స్టాక్ మార్కెట్లను నడిపిస్తున్నాయి.  

గ్లోబల్ మార్కెట్ నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లోనే నడుస్తున్నాయి. వరుసగా నాలుగు రోజులు క్షీణత ధోరణిని నేడు బ్రేక్ చేసింది. గ్లోబల్ మార్కెట్ క్షీణత కొనసాగుతోంది, అయితే దేశీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్ సానుకూలంగా కనిపిస్తోంది. ప్రారంభ ట్రేడ్‌లోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్లు ప్రారంభించారు, దీని కారణంగా మార్కెట్ పెరుగుదలను చూపుతోంది. అలాగే గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా మార్కెట్లను పాజిటివ్ గా స్పందిచేలా చేస్తున్నాయి 

ఈ ఉదయం సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో 62,504 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 18,571 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. గత నాలుగు సెషన్‌లుగా లాభాలను బుక్ చేసుకున్న ఇన్వెస్టర్లు ఈరోజు కొనుగోళ్లకు దిగారు, దీని కారణంగా మార్కెట్ ప్రారంభ లాభాలను పొందగలిగింది. ఉదయం 9.35 గంటలకు సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 62,461 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు పెరిగి 18,570 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇదిలా ఉంటే 10.45 గంటలకు సెన్సెక్స్ +74.37 పాయింట్ల లాభంతో 62,485.05 పాయింట్ల వద్ద పాజిటివ్ గా ట్రేడవుతోంది.

నేటి టాప్ గెయినర్స్‌లో LT, M&M, BAJAJFINSV, ICICIBANK, TITAN, WIPRO, SBI ఉన్నాయి. టాప్ లూజర్లలో కోటక్‌బ్యాంక్, టిసిఎస్, హెచ్‌యుఎల్, ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టెక్ మహీంద్రా ఉన్నాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లకు గ్లోబల్ సంకేతాలు బలహీనంగా కనిపిస్తున్నాయి. నేటి వ్యాపారంలో, ప్రధాన ఆసియా మార్కెట్లలో అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. కాగా బుధవారం కూడా అమెరికా మార్కెట్లపై ఒత్తిడి కనిపించింది. బ్రెంట్ క్రూడ్ మెత్తబడుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 78 డాలర్లుగా ట్రేడవుతోంది. అమెరికా ముడిచమురు బ్యారెల్‌కు 73 డాలర్లుగా ఉంది. USలో, 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 3.449 శాతంగా ఉంది.

click me!