స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు...40 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..

By Krishna AdithyaFirst Published Mar 28, 2023, 5:10 PM IST
Highlights

నేడు సెన్సెక్స్ 40 పాయింట్ల బలహీనతతో 57614 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 16052 వద్ద ముగిసింది.

మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు హెచ్చు తగ్గులు కనిపించాయి. నేటి  ట్రేడింగులో, సెన్సెక్స్,  నిఫ్టీ  ప్రారంభంలో లాభాలు చూసినప్పటికీ, చివరికి రెండూ బలహీనంగా ముగిశాయి. సెన్సెక్స్ ఎగువ స్థాయిల నుంచి 336 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 16950కి చేరువైంది. అటు సోమవారం అమెరికన్ మార్కెట్లు అంచున ముగిశాయి. ఈరోజు ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించినప్పటికీ. నేడు సెన్సెక్స్ 40 పాయింట్ల బలహీనతతో 57614 వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 16052 వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. నిఫ్టీలో ఆటో, ఐటీ, రియాల్టీ, మెటల్ సూచీలు రెడ్ మార్క్‌లో ముగిశాయి. నేడు హెవీవెయిట్ స్టాక్‌లలో అమ్మకాలు కనిపించాయి. సెన్సెక్స్ 30కి చెందిన 11 స్టాక్స్ గ్రీన్ మార్క్‌లో, 19 రెడ్ మార్క్‌లో ముగిశాయి. నేటి టాప్ గెయినర్స్‌లో INDUSINDBK, HDFCBANK, ICICIBANK, NTPC, RIL, HDFC ఉన్నాయి. టాప్ లూజర్స్‌లో TECHM, TATAMOTORS, Airtel, Wipro, HCL టెక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. సెక్టార్ సూచీలు చూస్తే బ్యాంక్ నిఫ్టీ 136.60 పాయింట్లు  పెరిగి 39,567.90 వద్ద, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.27%, నిఫ్టీ PSU బ్యాంక్ 0.21%, నిఫ్టీ IT 0.88%, నిఫ్టీ మెటల్ 0.79% పడిపోయాయి.

స్టాక్ ఎక్స్ఛేంజీలు NSE , BSE అదానీ గ్రీన్ ఎనర్జీని మార్చి 28 మంగళవారం నుండి దీర్ఘకాలిక అదనపు పర్యవేక్షణ చర్యల (ASM)  రెండవ దశలో చేర్చారు. అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ ASM ఫ్రేమ్‌వర్క్ పరిధిలోనే కొనసాగుతుంది,  అంతకుముందు, ఎన్‌ఎస్‌ఇ , బిఎస్‌ఇలు అదానీ గ్రూప్ కంపెనీలు అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లను దీర్ఘకాలిక ASM రెండవ దశ నుండి తొలగించి మొదటి దశలో ఉంచాయి. 

 

click me!