Business Guide: కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారా? ఈ 10 విషయాలను కచ్చితంగా తెలుసుకోండి!

Published : Aug 14, 2025, 07:22 PM IST
Business Guide: కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారా? ఈ 10 విషయాలను కచ్చితంగా తెలుసుకోండి!

సారాంశం

డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ త్వరగా సంపాదించాలంటే మాత్రం వ్యాపారం కంటే మంచి మార్గం మరొకటి లేదు. చిన్నదైనా, పెద్దదైనా వ్యాపారం చేసే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.  

నిజాయతీగా, ప్రణాళికా ప్రకారం ముందుకు సాగితే వ్యాపారంలో త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఒకప్పుడు చిన్న వ్యాపారంగా మొదలు పెట్టినవే. అయితే సొంతంగా బిజినెస్ మొదలుపెట్టడం కష్టమనిపించినా.. కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాపారంలో ఆశించిన స్థాయిలో రాణించవచ్చు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

బిజినెస్ ఆలోచనపై స్పష్టమైన అవగాహన

  • మీరు ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో..  స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. 
  • మీ వ్యాపార ఆలోచన ఏ సమస్యలను పరిష్కరిస్తుందో తెలుసుకోవాలి. 
  • మీ వ్యాపార లక్ష్యం ఏంటో.. మీ కస్టమర్లు ఎవరో.. తెలుసుకోవాలి
  • మీకు పోటిదారులు ఉన్నారా? ఉంటే వారికంటే మీరు ఎలా ప్రత్యేకంగా ఉంటారు? వంటి విషయాలపై అవగాహన అవసరం. 

మార్కెట్ రీసెర్చ్  

మార్కెట్ రీసెర్చ్.. కస్టమర్లను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 

  • మీ ఉత్పత్తి/సేవకు డిమాండ్ ఉందా?
  • ప్రజలు ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు?
  • కస్టమర్లు మీ ప్రొడక్టును ఎక్కడ కొనవచ్చు—ఆన్‌లైన్, స్థానిక మార్కెట్లు లేదా రెండూ?
  • సర్వేలు, ఇంటర్వ్యూలు లేదా పోటీదారులను చూడటం ద్వారా ఈ విషయాలు తెలుసుకోవచ్చు .

బిజినెస్ స్ట్రక్చర్

మీరు మీ వ్యాపారానికి సరైన లీగల్ స్ట్రక్చర్‌ను ఎంచుకోవాలి.  

  • సోలో ప్రొప్రైటర్‌షిప్
  • పార్టనర్‌షిప్ ఫర్మ్
  • లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (LLP)
  • ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
  • వన్ పర్సన్ కంపెనీ (OPC)
  • ప్రతి దానికీ దాని ప్రయోజనాలు, అప్రయోజనాలు, చట్టపరమైన బాధ్యతలు ఉంటాయి. మీకు తెలియకపోతే, CA లేదా బిజినెస్ సలహాదారుతో మాట్లాడితే సరిపోతుంది.

మీ బిజినెస్‌ని రిజిస్టర్ చేయండి

మీరు ఒక స్ట్రక్చర్‌ని ఎంచుకున్న తర్వాత, మీ వ్యాపారాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేయండి  

  • PAN, TAN పొందండి
  • మీ బిజినెస్ పేరును రిజిస్టర్ చేయండి
  • GST కోసం దరఖాస్తు చేసుకోండి (అవసరమైతే)
  • MCAతో రిజిస్టర్ చేయండి (LLPలు, ప్రైవేట్ లిమిటెడ్ కోసం)
  • షాప్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్ పొందండి

బిజినెస్ బ్యాంక్ అకౌంట్ 

వ్యక్తిగత, వ్యాపారానికి సంబంధించిన డబ్బును కలపకండి. మీ వ్యాపారం పేరుతో ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయండి.

ఆదాయం, ఖర్చులను ట్రాక్ చేయండి

మీరు ఆర్థిక నిపుణులుగా ఉండాల్సిన అవసరం లేదు… కానీ ఆదాయం, ఖర్చులు, పన్నులను ట్రాక్ చేయడం తప్పనిసరి. 

  • ఇన్‌వాయిస్‌లు, రసీదులను వ్యవస్థీకృతంగా ఉంచండి
  • GST రిటర్న్‌లు ఫైల్ చేయండి
  • అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి
  • CAని నియమించుకోండి

మీ బ్రాండ్‌ను..

  • వ్యాపారానికి గుర్తుండిపోయే పేరును ఎంచుకోండి
  • సరళమైన లోగోను డిజైన్ చేయండి
  • వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియా పేజీని సృష్టించండి
  • మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పంచుకోండి.

మొదటి కస్టమర్లను కనుగొనండి

వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించండి. కుటుంబం, స్నేహితులు, మీ స్థానిక నెట్‌వర్క్‌ను సంప్రదించండి. చిన్న చిన్న డిస్కౌంట్‌లను అందించండి. WhatsApp గ్రూపులు, Instagram లేదా స్థానిక మార్కెట్‌ప్లేస్‌లను ఉపయోగించుకోండి.

పన్నులు, నిబంధనలకు అనుగుణంగా..

మీ వ్యాపారం పెరిగేకొద్దీ.. నిబంధనలకు అనుగుణంగా ఉండటం మరింత ముఖ్యం.

  • రెగ్యులర్ GST ఫైలింగ్
  • అకౌంట్ పుస్తకాలను సరిగ్గా నిర్వహించడం
  • లైసెన్స్‌లను పునరుద్ధరించడం
  • కార్మిక చట్టాలను పాటించడం

వ్యాపార విస్తరణ..

వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత.. విస్తరించడం గురించి ఆలోచించండి. ప్రాథమిక అంశాలు దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాపార విస్తరణ మంచి ఫలితాలనిస్తుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RBI Repo Rate Cut: మీకు లోన్ ఉందా, అయితే గుడ్ న్యూస్‌.. ఏ లోన్ పై ఎంత ఈఎమ్ఐ త‌గ్గుతుందో తెలుసా.?
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది