గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా.. ?

By Sandra Ashok KumarFirst Published Sep 9, 2020, 3:40 PM IST
Highlights

 సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆగస్టు నెలలో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన వాటి గురించి ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో స్వాతంత్ర్య దినోత్సవం, ప్రణబ్‌ ముఖర్జీ, సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌, కోవిడ్‌-19లు  ఉన్నాయి. 

ముంబై:  ఈ రోజుల్లో  ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సాధారణం అయిపోయింది. ఈ విషయమైన, దేనిగురించైనా తెలుసుకోవాలనుకుంటే  గూగుల్ పై ఎక్కువగా అదారపడుతుంటం.

సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆగస్టు నెలలో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన వాటి గురించి ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో స్వాతంత్ర్య దినోత్సవం, ప్రణబ్‌ ముఖర్జీ, సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌, కోవిడ్‌-19లు  ఉన్నాయి.

గూగుల్ అత్యంత ట్రెండింగ్‌ సేర్చ్  విషయాలను విడుదల చేసింది. అందులో పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్‌ టాప్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. తర్వాత  ప్రణబ్ ముఖర్జీ  గురించి ఎక్కువగా  సెర్చ్ చేశారు. 

రష్యా మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్, స్పుత్నిక్ వి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ టి20 క్రికెట్ మ్యాచ్ వంటి అంశాలు భారతదేశంలో టాప్ ట్రెండ్ సర్చ్ లో ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం కోసం 3,750 శాతానికి పైగా సెర్చ్ చేశారని నివేదికలో తెలిపింది.

also read 

గూగుల్‌లో సెర్చ్‌ చేసిన  టాప్-10 ఇవే..!

1.అమిత్‌షాకు కరోనా పాజిటివ్ ?

2.బట్టలపై కరోనా ఎంతకాలం ఉంటుంది?

3. కరోనా వైరస్‌కు రష్యా మెడిసిన్ కనుగొన్నదా ? 

4.జియోలో కరోనా కాలర్‌ ట్యూన్‌ను ఎలా ఆపాలి?

5.భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు లాంచ్‌ చేస్తారు?

6.ఒళ్లు నొప్పులు కరోనా వైరస్ లక్షణమా ? 

7. కరోనాలో ఉష్ణోగ్రత ఎంత?

8.కరోనా లక్షణాలు ఎన్నిరోజుల్లో కనిపిస్తాయి?

9.ప్రణబ్‌ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా వచ్చిందా ?

10. ఎస్‌పి బాల సుబ్రహ్మణ్యానికి కరోనా ఎలా సోకింది? 

click me!