దేశ ఆర్థిక వ్యవస్థ ఎదురుదెబ్బ, 2022-23 జీడీపీ అంచనాలపై కోత పెట్టిన S&P Global Ratings

By Krishna AdithyaFirst Published Nov 28, 2022, 6:13 PM IST
Highlights

మరో రెండు రోజుల్లో అంటే, నవంబర్ 30, 2022న, గణాంకాల మంత్రిత్వ శాఖ 2022-23 రెండవ త్రైమాసికానికి భారతదేశ GDP డేటాను ప్రకటించబోతోంది. కానీ అంతకు ముందే, ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. రేటింగ్ ఏజెన్సీ 2022-23 జిడిపి అంచనాను 7 శాతానికి తగ్గించింది, దాని మునుపటి అంచనాను 30 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. 2023-24లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6 శాతంగా ఉండవచ్చని ఏజెన్సీ పేర్కొంది.

ప్రముఖ విదేశీ ఏజెన్సీ S&P గ్లోబల్ రేటింగ్స్ భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది. ఈ రేటింగ్ ఏజెన్సీ 2023 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి రేటు అంచనాను 30 బేసిస్ పాయింట్లు తగ్గించి 7 శాతంగా అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరానికి జిడిపి రేటును 6 శాతంగా ఉంచారు. దీనితో పాటు దేశీయంగా డిమాండ్ పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం చూపుతుందని ఈ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

సెప్టెంబర్‌లో ఎస్‌అండ్‌పి విడుదల చేసిన అంచనాల్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం చొప్పున వృద్ధి చెందవచ్చని పేర్కొంది. అదే సమయంలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో, ఈ రేటు 6.5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అయితే కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ జూలై-సెప్టెంబర్ జిడిపి డేటాను నవంబర్ 30 సాయంత్రం 5:30 గంటలకు విడుదల చేయబోతోంది.

బలమైన డిమాండ్ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచుతుంది
S&P గ్లోబల్ రేటింగ్స్ ఆసియా-పసిఫిక్ చీఫ్ ఎకనామిస్ట్ లూయిస్ కుయిజ్ మాట్లాడుతూ, “భారత ఆర్థిక వ్యవస్థలో మంచి డిమాండ్ కారణంగా, ప్రపంచ మందగమనం ప్రభావం తక్కువగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7 శాతంగా ఉండవచ్చు, ఇది గత సంవత్సరం 6 శాతంగా ఉండవచ్చని తెలిపారు. 

భారతదేశంలో వడ్డీ రేటు పెరిగినప్పటికీ, బ్యాంక్ క్రెడిట్‌లో మంచి వృద్ధి కనిపిస్తోందని ఇంతకుముందు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ చెప్పింది. దీని ప్రకారం, భారతదేశంలో క్రెడిట్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. ఇది 2021-22లో 11.50 శాతంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి 7 శాతంగా ఉంటుందని ఈ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది.

అదే సమయంలో, మరో గ్లోబల్ ఏజెన్సీ గోల్డ్‌మన్ సాక్స్ కూడా ఇటీవలే వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి అంచనాను 5.9 శాతానికి తగ్గించింది. స్థూల దేశీయోత్పత్తి (GDP) ఈ సంవత్సరం అంచనా వేసిన 6.9  శాతం నుండి 2023 క్యాలెండర్ సంవత్సరంలో 5.9 శాతంకి తగ్గవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ ఒక నివేదికలో పేర్కొంది.
 

click me!