స్టాక్ మార్కెట్ న్యూస్: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. 20 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ మొదటి IPO..

By asianet news telugu  |  First Published Nov 15, 2023, 10:43 AM IST

టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీ IPO నవంబర్ 22న ప్రారంభమై నవంబర్ 24న ముగుస్తుంది. టాటా టెక్ అనేది టాటా మోటార్స్ యూనిట్. ఐపీఓలో టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను విక్రయించనుంది. 


బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. NSE నిఫ్టీ 50 1.06% లాభంతో 19,651.40 వద్ద, BSE సెన్సెక్స్ 527.67 పాయింట్ల లాభంతో 65,461.54 వద్ద ప్రారంభమైంది.  బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 507.2 పాయింట్ల లాభంతో 44,398.45 వద్ద ప్రారంభమైంది. ఇతర రంగాల సూచీలు కూడా బుధవారం గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. 

టాటా గ్రూప్ 20 ఏళ్ల తర్వాత మళ్లీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీ IPO నవంబర్ 22న ప్రారంభమై నవంబర్ 24న ముగుస్తుంది. టాటా టెక్ అనేది టాటా మోటార్స్ యూనిట్. ఐపీఓలో టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను విక్రయించనుంది. దీని ద్వారా 3,000 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. టాటా టెక్ ఇష్యూలో ఆల్ఫా టీసీ 2.4 శాతం వాటాను, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం వాటాను విక్రయించనున్నాయి. టాటా గ్రూప్ చివరిసారిగా 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) IPOతో ముందుకు వచ్చింది. 

Latest Videos

ప్రభుత్వ సంస్థ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) ఐపీఓ నవంబర్ 21 నుంచి ప్రారంభమై నవంబర్ 23న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు నవంబర్ 20న డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు. కంపెనీ ధరను రూ.30-32గా నిర్ణయించింది. గతేడాది మేలో ఎల్‌ఐసీ తర్వాత ప్రభుత్వ కంపెనీకి ఇదే తొలి ఐపీఓ.

click me!