
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. రష్యా-ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు పెరగడంతో మార్కెట్ ఈరోజు ఊపందుకుంది. ఈ ఉదయం నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైన తర్వాత, మార్కెట్ వృద్ధిని కొనసాగించింది. మధ్యాహ్నం సెషన్‌లో మార్కెట్‌లో కొంత కన్సాలిడేషన్ నెలకొంది.
ఈరోజు సెన్సెక్స్ 740.34 పాయింట్ల లాభంతో 58683.99 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ 172.95 పాయింట్ల లాభంతో 17,498.25 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 486.90 పాయింట్ల లాభంతో 36334.30 వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో స్టాక్స్ పెరిగాయి
ఈరోజు మార్కెట్ 6 వారాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో షేర్లు నేటి వ్యాపారంలో పుంజుకున్నాయి. అయితే మెటల్, పవర్, ఆయిల్-గ్యాస్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మరోవైపు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం లాభంతో 24,023.91 వద్ద ముగిసింది. అదే సమయంలో, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.05 శాతం బలంతో 28,120.74 వద్ద ముగిసింది.
అదానీ షేర్ల అద్భుతమైన రాబడి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేడిలో ఉన్నప్పటికీ, అదానీ గ్రూపు స్టాక్‌లు మాత్రం ట్రెండ్ తో సంబంధం లేకుండా, తమ వాటాదారులకు అద్భుతమైన రాబడిని అందించాయి. ఇటీవల లిస్టయిన అదానీ విల్మార్ షేరు ధర గత నెలలో దాదాపు 32 శాతం పెరిగింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈలో అదానీ పవర్ షేర్ ధర జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.181.40కి చేరుకుంది. ఇది గత నెలలో దాని పెట్టుబడిదారులకు దాదాపు 40 శాతం రాబడిని ఇచ్చింది. గత నెలలో అదానీ పోర్ట్ స్టాక్ దాదాపు 7.50 శాతం పెరిగింది.
హరి ఓమ్ పైప్ IPO
హరి ఓం పైప్స్ యొక్క IPO నేటి నుండి అంటే మార్చి 30, 2022 నుండి సబ్ స్క్రప్షన్ కోసం ఓపెన్ అయ్యింది. ఈ వాటా విక్రయం ద్వారా కంపెనీకి రూ.130.05 కోట్లు లభిస్తాయని అంచనా. కంపెనీ 85,00,000 ఈక్విటీ షేర్లను IPO ద్వారా రూ. 144-153 ధర పరిధిలో విక్రయించబోతోంది. హైదరాబాద్‌కు చెందిన హరిఓమ్ పైప్స్ మైల్డ్ స్టీల్ (MS) పైపులు, పరంజా, హెచ్‌ఆర్ స్ట్రిప్స్, MS బిల్లెట్లు, స్పాంజ్ ఐరన్‌తో సహా ఇనుము, ఉక్కు ఉత్పత్తులను తయారు చేస్తుంది.