7th pay commission:నేడు కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం కానుక, డీఏ పెంపుపై కేబినెట్ అవకాశం..

Ashok Kumar   | Asianet News
Published : Mar 30, 2022, 02:23 PM IST
7th pay commission:నేడు కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం కానుక, డీఏ పెంపుపై కేబినెట్  అవకాశం..

సారాంశం

నేడు బుధవారం జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు హోలీ కానుక లభించనుంది. వాస్తవానికి, ఈ సమావేశంలో ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 3% పెంపుపై ప్రభుత్వం  ఆమోద ముద్ర వేయవచ్చని ఒక నివేదికలో  పేర్కొంది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు  గొప్ప కానుక అందే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ ఆలోవెన్స్  మూడు శాతం పెంచేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చని ఒక నివేదిక పేర్కొంది. 1 జనవరి 2022 నుంచి ఉద్యోగులకు పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందించాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది.

జీతంలో భారీగా పెంపు
కేంద్ర ప్రభుత్వం హోలీ సందర్భంగా కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంచి కానుకగా ఇవ్వవచ్చని గతంలోనే కథనాలు వచ్చాయి కానీ అది కుదరలేదు. అయితే ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో ఉద్యోగులకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. డీఏ పెంచితే జనవరి, ఫిబ్రవరితో పాటు మార్చి నెల డీఏ కూడా వేతనానికి జోడిస్తుంది. ఈ పరిస్థితిలో కేంద్ర ఉద్యోగులు పెరిగిన జీతం పొందుతారు. 

డీఏ పెంపుపై ప్రభుత్వం ప్రకటన 7th పే కమిషన్ సిఫార్సు ఆధారంగా ఉంటుంది. ఉద్యోగుల జీతం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ భిన్నంగా ఉంటుంది. దీనిని ప్రాథమిక వేతనంపై లెక్కించబడుతుంది. ఇంతకుముందు వచ్చిన నివేదికలను పరిశీలిస్తే హోలీకి ముందు ప్రభుత్వం డీఏ పెంపుపై ప్రకటన చేయడం ద్వారా ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇవ్వవచ్చని కూడా భావించారు. దీనికి సంబంధించి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. పెరిగిన జీతం జనవరి, ఫిబ్రవరి బకాయిలతో పాటు మార్చిలో ఉద్యోగులకు అందజేయనున్నారు. 

ప్రస్తుతం, మొత్తం డియర్‌నెస్ అలవెన్స్ 31 శాతంగా ఉంది, ఈ ప్రకటన తర్వాత 34 శాతానికి పెరగవచ్చు. డియర్‌నెస్ అలవెన్స్ 34 శాతానికి పెంచితే జీతం 20 వేల రూపాయలు పెరిగే అవకాశం ఉంది. 7వ కేంద్ర వేతన సంఘం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బేసిక్ పే ఆధారంగా నిర్ణయించబడుతుంది. అక్టోబర్‌లో 3 శాతం, జూలైలో 11 శాతం పెరిగిన తర్వాత ప్రస్తుత డీఏ రేటు 31 శాతానికి చేరుకుంది. డియర్‌నెస్ అలవెన్స్ ఉద్యోగి జీతం, పెన్షనర్ల పెన్షన్‌లో ప్రధాన భాగాన్ని ఏర్పరుస్తుంది

ఈ భత్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతాలపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి ఇవ్వబడుతుంది. 7వ వేతన సంఘం (7th CPC) కింద ప్రభుత్వం జనవరి, జూలైలలో సంవత్సరానికి రెండుసార్లు DAలో ఇంక్రిమెంట్ ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల లొకేషన్ ఆధారంగా కూడా డీఏ మారుతుంది.

48 లక్షల మంది ఉద్యోగులకు బెనిఫిట్
నివేదిక ప్రకారం, ప్రభుత్వం జీతాల పెంపును ప్రకటిస్తే భారతదేశం అంతటా దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. గతేడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 28 శాతం నుంచి 31 శాతానికి పెంచింది. కోవిడ్ -19 మహమ్మారి ఉన్నప్పటికీ, ఉద్యోగులకు డిఎ ఇంక్రిమెంట్ ఇవ్వబడింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
 

PREV
click me!

Recommended Stories

OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు