రెండు ముక్కలుగా కాశ్మీర్... నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

By telugu teamFirst Published Aug 5, 2019, 1:15 PM IST
Highlights

 బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 621 పాయింట్లు పతనమై 36,497 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 10,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది. 

జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కి ఉన్న స్వయం ప్రతిపత్తిని కేంద్రం నేడు రద్దు చేసింది. అదేవిధంగా రెండు భాగాలుగా విభజించింది. కాగా... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై భారీగా చూపించింది. సోమవారం ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి.

ఉదయం 11గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 621 పాయింట్లు పతనమై 36,497 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 185 పాయింట్లు కోల్పోయి 10,812 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.46 వద్ద కొనసాగుతోంది. 

హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బ్రిటానియా, బజాజ్‌ ఫినాన్స్‌, హీరో మోటార్‌కార్ప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రంగావారీగా చూస్తే దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో నమోదవుతుండడం గమనార్హం.

click me!