
తల్లిదండ్రులకు పిల్లల విద్యా చాలా ముఖ్యమైనది. వారు ఉన్నత చదువులకు వచ్చినప్పుడు కాలేజీలకి, యూనివర్సిటీలకి లక్షల్లో ఫీజులు కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక ఒత్తిడి పెరిగిపోతుంది. ముందస్తు ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా పిల్లల్ని మంచి సంస్థలలో చదివించవచ్చు. పిల్లల చిన్నప్పుడే ఈ పొదుపు చిట్కాలను పాటించడం మొదలుపెడితే వారు ఉన్నత చదువులకు వచ్చేసరికి ఇలాంటి ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగించగలుగుతారు.
పిల్లలు నాలుగో తరగతికి వచ్చిన వెంటనే మీరు వారి చదువు కోసం పొదుపు చేయడం ప్రారంభించాలి. భవిష్యత్తులో విద్యా ఖర్చులు ఎంత ఉంటాయో అంచనా వేసుకోండి. దీనికోసం ఒక పొదుపు ఖాతాను తీసుకోండి. అందులో కేవలం పిల్లలు చదువుకోసమే నెలనెలా కొంత మొత్తాన్ని వేస్తూ ఉండండి. ఇలా వారు ఉన్నత చదువులకు వచ్చేవరకు వేయండి. అప్పటివరకు ఆ డబ్బును దేనికీ వాడకండి. వారి ఉన్నత చదువులకు, యూనివర్సిటీలకు కట్టేందుకు వినియోగించండి. ఇది మీకు ఎలాంటి ఒత్తిడి లేని పరిస్థితులను కల్పిస్తుంది.
మ్యూచువల్ ఫండ్లలో SIPలు ఉత్తమమైనవి. చిన్న మొత్తాల్లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తాయి. ముఖ్యంగా 500 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే అధిక రాబడి వచ్చే అవకాశాలు కూడా సిప్ లో అధికంగా ఉంటాయి.
మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న సుకన్య సమృద్ధి యోజనాలో కొంత మొత్తాన్ని వేస్తూ ఉండండి. ప్రతి ఏడాది లక్షన్నర వరకు ఈ ఖాతాలో వేయవచ్చు. ఆడపిల్లలకు 21 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు వేయవచ్చు. అధిక రాబడిని ఇచ్చే పథకం ఇది. అందులోను పన్ను రహిత రాబడి ఇది మీకు అందిస్తుంది. 80c కింద పన్ను మినహాయింపులతో సురక్షితమైన దీర్ఘకాలిక పొదుపు పథకంగా ఇది పేరు తెచ్చుకుంది.
15 సంవత్సరాల లాక్ ఇన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఉత్తమమైనదని చెప్పుకోవచ్చు. ఇది పన్ను రహిత రాబడిని అందిస్తుంది. రిస్క్ కూడా చాలా తక్కువ. పెట్టుబడిదారులకు ఇది సురక్షితమైన ఎంపిక. కాబట్టి పిపిఎఫ్ లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ప్రయత్నించండి.
కచ్చితంగా జీవిత బీమాలు తీసుకోవలసిన అవసరం ఉంది. భీమా కంపెనీలు.. జీవిత బీమా, పొదుపు కలిపి ఎన్నో నిర్దిష్ట పథకాలను అందిస్తున్నాయి. ఇవి అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో డబ్బుని అందిస్తాయి. తల్లిదండ్రులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పిల్లలకు ఆర్థిక భద్రత, విద్యా, వారి అవసరాలు తీర్చేందుకు ఈ బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుంది.
మున్సిపల్ ఫండ్స్ లో పిల్లల విద్యా పొదుపు కోసం ఏవైనా పథకాలు ఉన్నాయేమో వెతకండి. ఇది ఈక్విటీ రుణ పెట్టుబడులను సమతల్యం చేస్తాయి. ఇది సౌకర్యవంతమైన పెట్టుబడి అందిస్తాయి. దీర్ఘకాలికంగా విద్యా లక్ష్యాలకు అనువైనవిగా ఉంటాయి.