చైనాకు షాకిచ్చిన సామ్‌సంగ్ ‌: వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు..

By S Ashok KumarFirst Published Dec 12, 2020, 11:17 AM IST
Highlights

కంపెనీ తన మొబైల్, ఐటి డిస్ ప్లే  ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి ఉత్తరప్రదేశ్‌కు మార్చనున్నట్లు యు.పి ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. 

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ భారత్‌లో రూ .4,825 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సామ్‌సంగ్ కంపెనీకి చెందిన మొబైల్, ఐ‌టి డిస్ ప్లే  ప్రొడక్షన్ యూనిట్‌ను చైనా నుంచి ఉత్తరప్రదేశ్‌కు మార్చనున్నట్లు యు.పి ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.

భారతదేశంలో ఏర్పాటు చేయనున్న  మొదటి హై-టెక్నిక్ ప్రాజెక్ట్ ఇది అని ఆయన అన్నారు. ప్రపంచంలో ఇటువంటి యూనిట్ ఉన్న మూడవ దేశంగా ఇండియా మారుతుందని ప్రతినిధి చెప్పారు.
 
సిఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యు.పి ప్రభుత్వం సామ్‌సంగ్ డిస్ ప్లే నోయిడా ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలను శుక్రవారం ఆమోదించింది. నోయిడాలోని యూనిట్ 510 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఈ సంస్థకు ఇప్పటికే నోయిడాలో మొబైల్ తయారీ యూనిట్ ఉంది. దీనిని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సామ్‌సంగ్ డిస్ ప్లే ఉత్పత్తులలో 70 శాతం టెలివిజన్ సెట్లు, మొబైల్స్, గడియారాలు, టాబ్లెట్లను దక్షిణ కొరియా, వియత్నాం, చైనాలలో తయారు చేస్తుంది.

also read డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్ కు పెరుగుతున్న యూజర్లు.. భారత్‌ నుంచే అత్యధిక వినియోగదారులు.. ...

ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకం కింద కంపెనీతో పాటు ఆపిల్ భాగస్వాములు ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ భారత ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తరువాత సామ్‌సంగ్ తాజా  ప్రకటన వచ్చింది.

ఈ కంపెనీలకు రూ.15 వేల తక్కువ ధర కలిగిన మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేయడానికి ప్రోత్సాహకాలు వచ్చాయి. 40 బిలియన్ల విలువైన హ్యాండ్‌సెట్‌లను పిఎల్‌ఐ పథకం కింద ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నారు.

'యుపి ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 2017' ప్రకారం భూమిని బదిలీ చేయడంలో శామ్సంగ్ స్టాంప్ డ్యూటీ మినహాయింపు పొందుతుంది. ఎలక్ట్రానిక్ తయారీ భాగాలు, సెమీకండక్టర్ల ప్రమోషన్ కోసం భారత ప్రభుత్వ పథకం కింద ఇది 460 కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందుకుంటుంది.

click me!