
స్టాక్ మార్కెట్‌లో ఒక విషయం సాధారణం, ఇక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత, ఓపికతో దాన్ని కొనసాగించడం అవసరం. ఒక పెట్టుబడిదారుడు ఫండమెంటల్స్‌ని చూసి కంపెనీ స్టాక్‌పై ఇన్వెస్ట్ వేస్తే, ఆ స్టాక్ భవిష్యత్తులో కచ్చితంగా పెట్టుబడిదారులకు మంచి రాబడిని ఇస్తుంది. ఏపీకి చెందిన ప్రముఖ కెమికల్ సంస్థ అయిన, స్మాల్ క్యాప్ కంపెనీ శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో లిమిటెడ్ (Sree Rayalaseema Hi-Strength Hypo) షేర్లలో కూడా ఇలాంటిదే కనిపించింది. కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ.33 లక్షల రూపాయలకు మార్చింది.
Sree Rayalaseema Hi-Strength Hypo స్టాక్ చరిత్ర ఇదే..
11 మే 2007 నాటికి కంపెనీ ఒక షేరు ధర రూ.19.70. జూలై 29న మధ్యాహ్నం 3:30 గంటలకు కంపెనీ ఒక షేరు ధర రూ.654.80కి పెరిగింది. అంటే ఈ 15 ఏళ్లలో కంపెనీ షేర్లు 3223.86% జంప్ చేశాయి. మే 2007లో ఎవరు రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే , తిరిగి ఇప్పుడు రూ.33.23 లక్షలకు పెరిగిఉండేది. మనం గత ఐదు సంవత్సరాల గురించి మాట్లాడినట్లయితే, 4 ఆగస్టు 2017న కంపెనీ షేరు ధర రూ.131. అప్పటి నుండి, కంపెనీ షేర్లు 399.85% జంప్‌ను చూశాయి. ఐదేళ్ల క్రితం రూ. 1 లక్ష ఇన్వెస్ట్ వేసిన ఇన్వెస్టర్ల రాబడులు రూ.5 లక్షలకు పెరిగాయి.
గత ఏడాది కాలంలో కూడా కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను నిరాశపరచలేదు. ఈ కాలంలో శ్రీ రాయలసీమ హై-స్ట్రెంత్ హైపో లిమిటెడ్ షేర్లు 89.96% రాబడిని ఇచ్చాయి. ఇన్వెస్టర్ల రూ.1 లక్ష రూ.1.90 లక్షలకు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడిన అస్థిరత మధ్య కూడా ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 92.05% రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, ఈ కంపెనీ షేర్లు గత నెలలో 57.86% పెరిగాయి.
ఆగస్టు 24, 2021న NSEలో కంపెనీ 52 వారాల గరిష్టం రూ. 669 నమోదు చేయగా, 52 వారాల కనిష్టం రూ.274. అంటే, కంపెనీ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 138% వరకు ట్రేడవుతున్నాయి.
(Note: ఇక్కడ అందించిన పనితీరు సమాచారం పెట్టుబడి సలహా మాత్రమే కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం నష్టాలకు లోబడి ఉంటుంది మరియు దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.)