
నేడు ఆగస్టు 1న పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. మహారాష్ట్ర మినహా దేశవ్యాప్తంగా గత 68 రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 21న తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే.
ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు ముందు ఢిల్లీలో పెట్రోలు ధర రూ.105.41 ఉండగా, ఈరోజు రూ.96.72గా ఉంది, డీజిల్ ధర రూ.96.67గా ఉండగా, రూ.89.62గా ఉంది. ముంబైలో, లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి ఈరోజు రూ. 106.31 కాగా, డీజిల్ రిటైల్ రూ. 94.27 వద్ద ఉంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) సహా ప్రభుత్వ రంగ OMC లు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
ముంబై: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర : లీటరుకు 94.27
ఢిల్లీ: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర: రూ. 89.62
చెన్నై: పెట్రోలు ధర: లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర: రూ. 94.24
కోల్‌కతా: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర: రూ. 92.76
బెంగళూరు: పెట్రోలు: లీటరుకు రూ. 101.94, డీజిల్: లీటరుకు రూ. 87.89
హైదరాబాద్ పెట్రోలు: లీటరుకు రూ.109.66, డీజిల్: లీటరుకు రూ.97.82
ముడి చమురు ధర
చైనా, జపాన్ నుండి వచ్చిన డేటా బలహీనమైన తయారీ పురోగతిని చూపించిన తరువాత సోమవారం ఉదయం ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.19 తగ్గి బ్యారెల్ $102.78 వద్ద ట్రేడవుతున్నాయి. WTI క్రూడ్ బ్యారెల్ $97.19 వద్ద ఉంది, రాయిటర్స్ ప్రకారం $1.43 తగ్గింది.