రిలయన్స్ రైట్స్ మెరుపులు.. ప్రిపెయిడ్ కస్టమర్లకు జియో షాక్‌..

By Sandra Ashok KumarFirst Published May 21, 2020, 10:18 AM IST
Highlights

రైట్స్ ఇష్యూలో రిలయన్స్ మెరుపులు మెరిపించింది. కొనుగోలుకు డిమాండ్ పెరగడంతో 40 శాతం పెరిగి రూ.150 నుంచి రూ.210కి చేరుకున్నది.
 

ముంబై: ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మెరుపులు మెరిపించింది. 30 ఏళ్ల తర్వాత బుధవారం సంస్థ రూ.53,125 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూ జారీ చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్లలో తొలి రోజే దూసుకెళ్లింది.

రిలయన్స్ రైట్స్ ఇష్యూలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి ప్రతి 15 షేర్లకు ఒక షేర్ కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ రైట్స్ ఎంటైటిల్మెంట్  ఏకంగా 40 శాతం దూసుకు వెళ్లింది. అర్హత గల వారికి డీమ్యాట్ ఖాతాల్లో రైట్స్ ఎంటైటిల్మెంట్స్ (ఆర్ఈ) జారీ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. 

అర్హత ఉన్నా రైట్స్ ఇష్యూకు దరఖాస్తు చేసుకోని వారు, తమ హక్కును విక్రయించుకోవడమే రైట్స్ ఎంటైటిల్మెంట్.. అలా చేసిన తొలి రైట్స్ ఇష్యూ రిలయన్స్ సంస్థదే. ఈ రైట్స్ ఎంటైటిల్మెంట్లు స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయన్నమాట. 

రిలయన్స్ సంస్థ రైట్స్ ఇష్యూలో ఏ సంస్థ అయిన అంతకుముందు కంపెనీ ముగింపు ధరకు, ప్రస్తుత ధరకు మధ్యన ఉన్న తేడానే రైట్స్ ఇష్యూగా నిర్ణయిస్తారు. దీని ప్రకారమే రిలయన్స్ ఆర్ఐ ధర అంతక్రితం ముగింపు ధరను రూ.151.90గా నిర్ణయించారు. 

also read 

ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఆర్ఐ రూ.158.05 వద్ద మొదలై గరిష్ఠంగా రూ.212 ధర వద్ద ముగిసింది. అంటే అంతక్రితం ముగింపు ధరతో పోలిస్తే 39.57 శాతం లాభం అన్నమాట. విక్రేతలకంటే కొనుగోలుదారులే ఎక్కువగా ఉండటంతో రైట్స్ ఇష్యూ ధర దూసుకువెళ్లింది. ట్రేడింగ్ పరిమాణం కూడా రిలయన్స్ కంటే ఎక్కువగానే నమోదైంది. 

జియో ప్రీ పెయిడ్ ఖాతాదారులకు ఝలక్
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ఖాతాదారులకు షాకిచ్చింది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్ అయిన రూ. 98ను పూర్తిగా తొలగించింది. 28 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ను రూ.129కి పెంచేసింది. జియో రూ.98 ప్లాన్‌లో 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియో, ల్యాండ్ లైన్ కాలింగ్ ప్రయోజనాలు ఈ ప్లాన్‌లో ఉండేవి. రూ. 999 ప్లాన్‌ను ప్రారంభించిన నేపథ్యంలో రూ. 98 ప్లాన్‌ను తొలగించింది. 

రూ. 999 ప్లాన్‌లో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఇక, తొలగించిన రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 300 ఎస్సెమ్మెస్‌లు, 2జీబీ హైస్పీడ్ డేటా, జియో నుంచి జియోకు కాల్స్ వంటి ప్రయోజనాలు 28 రోజుల కాలపరిమితితో లభించేవి.  

click me!