అమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. ఇన్ని సౌకర్యాలు ఎక్కడ చూసి ఉండరు..

By Ashok kumar SandraFirst Published Apr 20, 2024, 9:17 PM IST
Highlights

ఇందులో 100 గదులు ఉన్నాయి. ఐదు సెలూన్లు, 17 బెడ్‌రూమ్ సూట్‌లు, లేటెస్ట్ కిచెన్, హెయిర్ సెలూన్ ఇంకా  50 గుర్రాలకు లాయం.  36 పార్కులు, సిబ్బంది అపార్ట్మెంట్లతో సహా ఎన్నో  సౌకర్యాలు ఉన్నాయి.
 

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. అదే ఇల్లు అమ్మకానికి ఉందంటే.. మీరు కొనాలనుకుంటే దాని ధర ఎంతో ముందు  తెలుసుకోవాలి. ఫ్రాన్స్‌లోని సీన్-ఎట్-మార్నేలో ఉన్న చాటౌ డి'అర్మైన్‌విల్లియర్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు అని నమ్ముతారు. మాన్షన్ గ్లోబల్ ప్రకారం, ఈ ఇల్లు ఒకప్పుడు రోత్‌స్‌చైల్డ్ కుటుంబంకి  తరువాత మొరాకో రాజుకి చెందినది. అమ్మకానికి ఉన్న ఈ ఇంటి  ధర రూ.3,775 కోట్లు.  

ఈఫిల్ టవర్‌కు తూర్పున 30 మైళ్ల దూరంలో ఉన్న చాటౌ డి'అర్మైన్‌విలియర్స్‌కు పెద్ద  చరిత్ర ఉంది. 1100లలో నిర్మించబడిన ఈ కోట ఫ్రెంచ్ విప్లవం సమయంలో పాక్షికంగా నాశనం చేయబడింది. అయితే రోచెఫౌకాల్డ్ డౌడౌవిల్లే కుటుంబం మరింత భూమిని కొని  కోటను పునరుద్ధరించింది. 1980లలో మొరాకో రాజు హసన్ IIకి చాటేయు డి ఆర్మైన్‌విలియర్స్‌ను విక్రయించారు. 1999లో కింగ్ హసన్ II మరణానంతరం, 2008లో చివరిసారిగా బదిలీ చేయబడింది, అతని కుమారుడు ఆస్తిని స్వాధీనం చేసుకుని $200 మిలియన్లు అంటే రూ.1,600 కోట్లకు విక్రయించాడు. కొనుగోలు చేసిన వారి సమాచారం అందుబాటులో లేదు. 

ఇక్కడ 100 గదులు ఉన్నాయి. మూడు ఎలివేటర్లు, ఐదు సెలూన్లు, 17  బెడ్‌రూమ్ సూట్‌లు, అత్యాధునిక వంటగది ఉన్నాయి. హెయిర్ సెలూన్, 50 గుర్రాలకు స్థలాం.  36 వివిధ పార్కులు ఇంకా  సిబ్బంది అపార్ట్మెంట్లతో సహా ఎన్నో  సౌకర్యాలు ఉన్నాయి.  

click me!