ముగిసిన ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం.. రెపో రేటుపై కీలక నిర్ణయం..

By S Ashok KumarFirst Published Apr 7, 2021, 10:42 AM IST
Highlights

ఆర్‌బి‌ఐ  ద్రవ్య విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది. అయితే కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బి‌ఐ గవర్నర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఏప్రిల్ 5న ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ సమావేశం  నేడు ముగిసింది. విలేకరుల సమావేశంలో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 

కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితిలో సెంట్రల్ బ్యాంక్ చేసిన ప్రకటనలు ప్రాముఖ్యత సంతరించుకొనున్నాయి. 

అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన మొదటి ఎంపిసి సమావేశం ఇది. రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా పాలసీ రేట్లను 22 మే 2020న సవరించింది.

also read 

ముఖ్య విషయాలు:
ఎప్పటిలాగే ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. ఇది ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఈ నిర్ణయాన్ని ఎంపిసి  ఏకగ్రీవంగా తీసుకుంది. అంటే, వినియోగదారులకు ఇఎంఐ లేదా రుణల వడ్డీ రేట్లపై కొత్తగా ఎలాంటి  ఉపశమనం లభించలేదు.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు కూడా 4.25 శాతంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగా స్థిరంగా ఉందని శక్తికాంత  దాస్ తెలిపారు. 

దీంతో బ్యాంక్ రేటును మార్చకూడదని నిర్ణయించారు. ఇది 4.25 శాతంగా ఉంది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య వైఖరిని ‘లిబరల్’గా ఉంచింది.
 

click me!