రిలయన్స్ జియో తన వినియోగదారులకు మూడు కొత్త రీచార్జ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. 1000 నిమిషాల ఐయూసీ కాల్స్ ఉచితమని పేర్కొంది. ఒక నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 ప్లాన్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్లను ఎంచుకుంటే ఐయూసీ కోసం అదనంగా చెల్లించనవసరం లేదని జియో పేర్కొంది.
ముంబై: ఇప్పటి వరకు నామమాత్రపు రీచార్జీతో సేవలందించిన ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రూట్ మార్చింది. ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ పేరిట కొత్త మంత్లీ రీచార్జి ప్లాన్లను ఆవిష్కరించింది. ఇటీవల నిమిషానికి ఆరు పైసల చార్జీల వడ్డనపై నిరసనలు వెల్లువెత్తడంతో జియో కొత్త ఎత్తుగడతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చినట్టు కనిపిస్తోంది.
ఉచిత ఐయూసీ కాల్స్ ఆఫర్‌తో ‘జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ (మూడు రీచార్జ్ ప్లాన్ల)ను సోమవారం తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. ప్రధానంగా జియోయేతర మొబైల్ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్ కాలింగ్ వసతి కల్పిస్తుంది.
also readగూగుల్ షాకింగ్ న్యూస్ ఆ ఫోన్లలో 5.జీ నెట్ వర్క్ పనిచేయదంటా!
ఈ కొత్త ప్లాన్స్ ఒక నెలకు రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444 ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
మూడు నెలల 2జీబీ ప్యాక్ (రూ. 448)తో పోలిస్తే.. రూ. 444 మాత్రమే ఖర్చవుతుంది. రూ. 396 (198x2) ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ.333 మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని కొనాలంటే వినియోగదారుడు రూ. 80 వెచ్చించాల్సి వస్తుందని జియో పేర్కొంది.
also readడిజిటల్ గేట్‌వే ఆఫ్ ఇండియా జియో ప్రాఫిట్ 45.4%
కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ, వొడాఫోన్ ఐడియా స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.