స్పెషల్ కలెక్షన్‌తో రిలయన్స్ జ్యువెల్స్ ఉగాది వేడుకలు.. 20% తగ్గింపును కూడా..

Ashok Kumar   | Asianet News
Published : Mar 31, 2022, 06:12 PM IST
స్పెషల్ కలెక్షన్‌తో రిలయన్స్ జ్యువెల్స్ ఉగాది వేడుకలు.. 20% తగ్గింపును కూడా..

సారాంశం

ఉగాది కోసం ప్రత్యేకమైన గోల్డ్ టెంపల్ ఆభరణాలు ఆవిష్కరించి వేడుకలకు శ్రీకారం చుట్టింది రిలయన్స్ జ్యువెల్స్.  

మార్చి 2022: భారతదేశపు  ప్రముఖ ఆభరణాల బ్రాండ్ రిలయన్స్ జ్యువెల్స్ కొనుగోలుదారుల కోసం నూతన సంవత్సర ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక కలెక్షన్‌ విడుదల చేసింది. ఉత్సవాన్ని, పండగ వేడుకలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారతదేశానికి చెందిన వారి అభిరుచులు, ప్రాధాన్యతలకు ప్రతిరూపంగా నిలిచే ప్రత్యేక బంగారు ఆభరణాల కలెక్షన్‌ రూపొందించింది. రిలయన్స్ జ్యువెల్స్ వారి అద్భుతమైన గోల్డ్ టెంపుల్ ఆభరణాల కలెక్షన్‌తో ఉగాది వేడుకలు జరుపుకోండి.
 
సమాజంలోని అందరినీ ఒక చోటుకు చేర్చి, పండగ వేడకులు ఆనందకరంగా జరుపుకోవాలనే అంశాన్ని ప్రేరణగా తీసుకొని ఈ  కలెక్షన్‌లోని డిజైన్‌లు రూపొందించడం జరిగింది. ఉత్సవాల నిజమైన అర్థాన్ని తెలియజేప్పి, కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతీ ఆభరణం ఎంతో జాగ్రత్తగా డిజైన్‌ చేయబడింది.
ఉగాది కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ విశిష్ఠమైన టెంపుల్‌ జువెలరీ కలెక్షన్‌లో సాంప్రదాయ బంగారు నెక్లెస్ సెట్‌ రూపంలో క్లిష్టమైన టెంపుల్ జ్యువెలరీ డిజైన్స్‌, కలర్‌ స్టోన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. పండగ వేడుకలు, సంప్రదాయాలకు ఈ ఆభరణాలు చక్కగా సరిపోతాయి. మీరు ప్రేమించే వ్యక్తులకు ఇచ్చేందుకు ఇది ఒక   గొప్ప బహుమతి అవుతుంది. అలాగే వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్‌లో మరో అద్భుత ఆకర్షణగా నిలుస్తుంది.
 
ఈ సరికొత్త ఆభరణాలతో పాటు  1 ఏప్రిల్ 2022 నుంచి  4 ఏప్రిల్  2022 వరకు ప్రత్యేక పండుగ ఆఫర్‌ను కూడా రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై ఫ్లాట్ 20% తగ్గింపు ఉంటుంది. రిలయన్స్ జ్యువెల్స్  డైమండ్ ఉత్పత్తుల ఇన్వావాయిస్ విలువపై ఫ్లాట్ 20% తగ్గింపును కూడా కొనుగోలుదారులు పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాల ఆఫర్, నిబంధనలు & షరతులు వర్తిస్తాయి.

ఈ కట్టిపడేసే అద్భుతమైన కలెక్షన్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ & కర్ణాటకలోని అన్ని రిలయన్స్ జ్యువెల్స్ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లలో ప్రత్యేకంగా లభిస్తుంది. కొత్త కలెక్షన్‌ గురించి రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ, “మా సరికొత్త కలెక్షన్ ద్వారా ఈ ఉగాది పండగ సందర్భంగా  సమాజాలు, మా విలువైన కస్టమర్లు ఒక చోటుకు చేర్చి వేడుకలు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా కస్టమర్ల కోసం ఉత్తమమైన వాటిని తీసుకురావడం మా లక్ష్యం. ఇప్పుడు ఈ పండుగ డిజైన్లు ఆనందకరంగా ఉగాది వేడుకలు జరుపుకునేలా అందరినీ ప్రేరేపిస్తాయని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.
 
రిలయన్స్‌ జ్యూవెల్స్ గురించి:
భారతదేశంలో అగ్రగామి రిటైలర్‌  రిలయన్స్ రిటైల్‌ లిమిటెడ్‌లో భాగం రిలయన్స్ జ్యువెల్స్. అద్భుతమైన, విస్తృత శ్రేణి గోల్డ్,  డైమండ్, ప్లాటినం & సిల్వర్ ఆభరణాల కలెక్షన్స్ అందిస్తుంది ఈ బ్రాండ్. డిజైన్, నైపుణ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కళలు, హస్తకళలు, ఘనమైన భారతీయ వారసత్వం నుంచి ప్రేరణ పొంది ప్రత్యేకమైన, వైవిధ్యభరితమైన డిజైనర్‌ కలెక్షన్స్‌ను కొనుగోలుదారులకు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. కస్టమర్లు తమ జీవితంలోని ప్రతీ ప్రత్యేకమైన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవాలని రిలయన్స్‌ జ్యువెల్స్ కోరుకుంటుంది.

భారతదేశంలో 125+ నగరాల్లో 250+ ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లు & షాప్-ఇన్ షాపులు కలిగిన రిలయన్స్‌ జ్యువెల్స్ వాటిని గణనీయంగా విస్తరిస్తోంది. ఖాతాదారులకు అనుపమానమైన సేవలు, ఒక ప్రత్యేకమైన ఆభరణాల కొనుగోలు షాపింగ్‌ అనుభూతిని అందించేందుకు బ్రాండ్‌ ఎల్లవేళల కృషి చేస్తుంది. రిలయన్స్ జ్యువెల్స్‌లో గోల్డ్, వజ్రాభరణాలు అత్యంత సరసమైన ధరల్లో లభిస్తాయి. జీరో వేస్టేజ్‌, సరసమైన తయారీ ధరలు కొనుగోలుదారులకు 100% సంతృప్తిని అందిస్తాయి. 100 శాతం స్వచ్ఛత, పారదర్శకమైన ధరల విధానం, ప్రతీ నగలపై హమీపూర్వక నాణ్యతను రిలయన్స్ జ్యువెల్స్‌ అందిస్తుంది. 100 శాతం బీఐఎస్‌ హాల్‌మార్క్డ్‌ బంగారం, అంతర్జాతీయంగా స్వతంత్ర ధ్రువీకరణ ప్రయోగశాలలు ధ్రువీకరించిన ఆభరణాలను మాత్రమే ఈ బ్రాండ్‌ విక్రయిస్తుంది. రిపేర్ల కోసం క్యూసీ టెక్‌రూమ్స్‌తో పాటు బంగారం స్వచ్ఛతను కొనుగోలుదారులు ఉచితంగా తెలుసుకునేందుకు క్యారెట్‌ మీటర్‌, ఇంకా ఎన్నో సేవలు రిలయన్స్ జ్యువెల్స్ అందిస్తోంది. ప్రతీ కొనుగోలుపై లాయల్టీ పాయింట్లు కూడా ఈ బ్రాండ్ అందిస్తోంది.

ప్రతీ కలెక్షన్‌లో మైమరపింపజేసే డిజైన్లు అందించే రిలయన్స్ జ్యువెల్స్‌లో ప్రతీ వ్యక్తిత్వానికి, ప్రతీ సందర్భానికి ఒక ఆభరణం లభిస్తుంది.
మరింత సమాచారం కోసం మమ్మల్ని ఇక్కడ సందర్శించండి  http://www.reliancejewels.com
ఫేస్ బుక్ : https://www.facebook.com/RelianceJewels/
ఇన్‌స్టాగ్రామ్‌: https://www.instagram.com/reliancejewels/
యూట్యూబ్‌: సందర్శించండి సబ్‌స్క్రైబ్‌ చేయండి ఇక్కడ -https://bit.ly/3CFj3Y5

PREV
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే