బిల్ గేట్స్ వెంచర్‌లో ముకేష్ అంబానీ భారీ పెట్టుబడులు..

Ashok Kumar   | Asianet News
Published : Nov 13, 2020, 04:47 PM ISTUpdated : Nov 13, 2020, 09:49 PM IST
బిల్ గేట్స్ వెంచర్‌లో ముకేష్ అంబానీ భారీ పెట్టుబడులు..

సారాంశం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ పరంగా 50 మిలియన్ డాలర్లను బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్ II ఎల్‌పి(బిఇవి)లో పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలో బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్ ఉంది.

దేశంలోని అత్యంత విలువైన సంస్థ, బిలియనీర్ ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ పరంగా 50 మిలియన్ డాలర్లను బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్ II ఎల్‌పి(బిఇవి)లో పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలో బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్ ఉంది. ఈ పెట్టుబడికి సంబంధించి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఈ పెట్టుబడికి సంబందించి రాబోయే ఎనిమిది నుండి 10 సంవత్సరాల వాయిదాలలో ఈ పెట్టుబడులు పెట్టనుంది.

బ్రేక్ త్రూ ఎనర్జీ వెంచర్స్ ఇంధన, వ్యవసాయం సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాతావరణ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుంది. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో ఆవిష్కరణలకు తోడ్పడటానికి కంపెనీ పెట్టుబడిదారుల నుండి సేకరించిన మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టనుంది. 

also read పండుగ వేళ దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10 గ్రా, ధర ఎంతంటే ? ...

 ఈ పెట్టుబడి భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఇది పెట్టుబడిదారులకు మంచి రాబడిని కూడా ఇస్తుంది అని తెలిపింది.

ఈ లావాదేవీని పూర్తి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అనుమతి తప్పనిసరి అని తెలిసింది. ఈ పెట్టుబడిలో రిలయన్స్ ప్రమోటర్లు లేదా గ్రూప్ కంపెనీల ప్రయోజనం ఉండదు. ముఖేష్ అంబానీ చాలా కాలంగా నేచురల్ ఎనర్జి వనరులను సమర్థిస్తున్నారు అనడంలో ఈ పెట్టుబడి ఉండనుంది.

విశ్లేషకులు, మార్కెట్ వర్గాల అంచనాలకు సంబంధించి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) శుక్రవారం త్రైమాసిక ఫలితాల్లో రూ.9,567 కోట్ల నికర లాభాన్ని చూపించింది. సంస్థ ఏకీకృత నికర లాభం మరోసారి రూ .10,000 కోట్లను దాటింది. ఏకీకృత నికర లాభం అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం పెరిగి రూ .10,602 కోట్లకు చేరుకుంది. 

PREV
click me!

Recommended Stories

Best cars Under 8Lakhs: రూ. 8 లక్షలలోపే వచ్చే బెస్ట్ కార్లు ఇవే, భారీగా అమ్మకాలు
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే