వుమెన్స్ డే సందర్భంగా మహిళల కోసం ఒక కొత్త ప్లాట్‌ఫాం ఆవిష్కరించిన నీతా అంబానీ..

By S Ashok KumarFirst Published Mar 8, 2021, 10:55 AM IST
Highlights

ఈ మొట్టమొదటి డిజిటల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం మహిళల సాధికారతను వేగవంతం చేయడానికి, పరస్పర సహకారం, భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా బంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ఆదివారం రోజున మహిళల లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉద్దేశించిన 'హర్‌ సర్కిల్‌' పేరిట  ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం మార్చి 8న అంటే నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఈ మొట్టమొదటి డిజిటల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం మహిళల సాధికారతను వేగవంతం చేయడానికి, పరస్పర సహకారం, భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా బంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

హర్ సర్కిల్‌లో రిజిస్ట్రేషన్ ప్తతి ఒక్క మహిళకు ఉచితం. ప్రాథమికంగా ఇంగ్లీష్‌లో ఉండే హర్‌ సర్కిల్‌ క్రమంగా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

also read 

హర్ సర్కిల్‌ ప్రారంభం సందర్భంగా నీతా అంబానీ, "మహిళలు మహిళలపై మొగ్గు చూపినప్పుడు, నమ్మశక్యం కాని విషయాలు జరుగుతాయి!  నా జీవితంలో నేను బలమైన మహిళలను చూశాను, వీరి నుండి నేను  చాలా నేర్చుకున్నాను కూడా, దానికి ప్రతిగా నేను తెలుసుకున్నవి, నేర్చుకున్నవి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాను. "

"11 మంది అమ్మాయిల కుటుంబంలో  పెరిగిన నేను, నన్ను నేను నమ్మడం నేర్చుకున్నాను. నా కుమార్తె ఇషా నుండి నా కలలను కొనసాగించడానికి నాకు  ప్రేమ, విశ్వాసం లభించాయి." 

"హెర్ సర్కిల్.ఇన్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా లక్షలాది మంది మహిళలకు మద్దతు, సంఘీభావం సృష్టించడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇది ప్రతి స్త్రీని చేరడానికి ఆహ్వానిస్తుంది అని అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు.
 

click me!