భారతదేశ గ్యాస్ డిమాండ్ తీర్చేందుకు కెజిడి6బ్లాక్‌లో ఉత్పత్తిని ప్రారంభించనున్న రిలయన్స్, బిపి

By S Ashok KumarFirst Published Apr 26, 2021, 12:45 PM IST
Highlights

ఆర్‌ఐఎల్, బిపి నేడు ఇండియా ఈస్ట్ కోస్ట్  బ్లాక్ కెజి డి6లోని శాటిలైట్ క్లస్టర్ గ్యాస్ ఫీల్డ్ నుండి  గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఈ అభివృద్ది కెజి డి6బ్లాక్‌లో ఉన్న హబ్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటాయి.
 

ముంబై, 26 ఏప్రిల్ 2021: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), బిపి నేడు ఇండియా ఈస్ట్ కోస్ట్  బ్లాక్ కెజి డి6లోని శాటిలైట్ క్లస్టర్ గ్యాస్ ఫీల్డ్ నుండి ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించాయి. ఆర్‌ఐఎల్ అండ్ బిపి బ్లాక్  కెజి డి6-ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్ అండ్ ఎం‌జేలలో మూడు డీప్ వాటర్ గ్యాస్ ని అభివృద్ధి చేస్తున్నాయి.

ఇవి 2023 నాటికి 30ఎం‌ఎం‌ఎస్‌సి‌ఎం‌డి (రోజుకు 1 బిలియన్ క్యూబిక్ అడుగులు) అంటే భారతదేశ గ్యాస్ డిమాండ్ లో 15% వరకు న్యాచురల్ గ్యాస్ ని ఉత్పత్తి చేస్తాయని భావిస్తున్నారు.  ఈ అభివృద్ది కెజి డి6బ్లాక్‌లో ఉన్న హబ్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటాయి.

ఈ బ్లాక్  ఆపరేటర్ ఆర్‌ఐ‌ఎల్  66.67% వాటాతో బిపి 33.33% వాటాతో ఉంది. 2020 డిసెంబర్‌లో ఆర్ క్లస్టర్ ప్రారంభమైన తరువాత వచ్చే మూడు అభివృద్దిలో రెండవది శాటిలైట్ క్లస్టర్. అయితే ఇది 2021 మధ్యలో ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. ఈ ఫీల్డ్ భారతదేశం తూర్పు తీరంలో కాకినాడ వద్ద ఉన్న ఆన్‌షోర్ టెర్మినల్ నుండి  60 కిలోమీటర్ల దూరంలో 1850 మీటర్ల నీటి లోతులో ఉంది.

also read రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చేతికి మరో చారిత్రక ఐకానిక్ బ్రిటిష్ కంపెనీ.. ...

ఈ ఫీల్డ్ మొత్తం ఐదు బావులను ఉపయోగించి నాలుగు రిజర్వైర్ నుండి గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది అలాగే 6ఎం‌ఎం‌ఎస్‌సి‌ఎం‌డి  వరకు గ్యాస్ ఉత్పత్తి చేరుకుంటుంది. ఆర్ క్లస్టర్ అండ్ శాటిలైట్ క్లస్టర్ కలిసి భారతదేశ ప్రస్తుత గ్యాస్ ఉత్పత్తిలో 20% వరకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. మూడవ కెజి డి6 అభివృద్ధి,ఎం‌జే 2022 చివరిలో  వస్తుందని భావిస్తున్నారు.

ఆర్‌ఐ‌ఎల్ కార్యకలాపాలు హైడ్రోకార్బన్ ఎక్స్ ప్లోరేషన్, ఉత్పత్తి, పెట్రోలియం రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్ అండ్ డిజిటల్ సేవలను కలిగి ఉంటాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో చోటు దక్కించుకున్న ఆర్‌ఐ‌ఎల్  భారతదేశం నుండి అగ్రస్థానంలో ఉంది. 

భారతదేశంలో ఒక శతాబ్దం పాటు వ్యాపార ఉనికితో ఉన్న బిపి దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ ఇంధన సంస్థలలో ఒకటి. 

click me!