RBI Repo Rate: దసరా పండగ ముందే బంపర్ ఆఫర్ అందించనున్న ఆర్బీఐ..ఏంటో తెలిస్తే పండగే..

By Krishna Adithya  |  First Published Oct 2, 2023, 5:10 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సారి ఎంపీసీ సమావేశంలో కూడా రెపో రేట్లను మార్చే అవకాశం కనిపించడంలేదు. ఆర్‌బిఐ ద్రవ్య విధాన సమావేశం ఈ వారంలో జరగనుంది. అయితే ఈ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.


RBI MPC ద్రవ్య విధాన కమిటీ సమావేశం అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 6 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరగనుంది. ఈ సారి కూడా ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 2022, ఫిబ్రవరి 2023 మధ్య, RBI రెపో రేటును 2.5 శాతం పెంచింది. ఈ సారి కూడా ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితి తీసుకునే చాన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతంగా ఉంది. అక్టోబర్ 4, 6 తేదీల మధ్య జరిగే MPC సమావేశంలో రెపోరేటు 6.50 శాతం వద్ద ఉంచాలని కమిటీ భావిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ అక్టోబర్ 6న ప్రకటిస్తారు.

రెపో రేటులో ఎలాంటి మార్పు ఉండదు..
బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ, ఈసారి కూడా క్రెడిట్ విధానం ప్రస్తుత రేటు వద్దే స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కారణంగా రెపో రేటు కూడా 6.5 శాతంగానే ఉంటుందన్నారు. అయితే రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.8 శాతం ఎగువ స్థాయిలోనే కొనసాగుతోంది. ఇది సెప్టెంబరు, అక్టోబర్‌లో తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.

Latest Videos

undefined

ఎంపిసి సమావేశంలో వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం ఉందని ఐసిఆర్‌ఎ లిమిటెడ్‌కు చెందిన ఫైనాన్షియల్ సెక్టార్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , గ్రూప్ హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతున్నందున ఆర్‌బిఐ జాగ్రత్తగా ఉండవచ్చని ఆయన అన్నారు. దీని ప్రత్యక్ష ప్రభావం కాపిటల్ ఇన్ ఫ్లోస్, ఫారెక్స్ నిల్వలు, ఇది మారకపు రేట్లను పెంచుతుంది.

ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఇది ఇప్పటికీ ఆర్‌బిఐ కంఫర్ట్ జోన్ కంటే ఎక్కువగానే ఉందని యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ హెడ్-ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌లో ఉన్న పారిజాత్ అగర్వాల్ అన్నారు.

2022లో చివరిసారిగా వడ్డీ రేట్లు పెరిగాయి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఆహార కొరత కారణంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయికి చేరుకుంది. దీన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. RBI వడ్డీ రేట్లను మే 2022లో 0.40 శాతం, జూన్ 2022లో 0.50 శాతం, ఆగస్టు 2022లో 0.50 శాతం, సెప్టెంబర్ 2022లో 0.50 శాతం, డిసెంబర్ 2022లో 0.35 శాతం , 2023 ఫిబ్రవరిలో 0.25 శాతం పెంచింది. ఈ విధంగా రెపో రేటు 4 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది.

click me!