Breaking News: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు, 0.50 శాతం రెపో రేటు వడ్డన..ఇకపై లోన్లు మరింత భారం..

Published : Aug 05, 2022, 10:40 AM ISTUpdated : Aug 05, 2022, 10:43 AM IST
Breaking News: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు, 0.50 శాతం రెపో రేటు వడ్డన..ఇకపై లోన్లు మరింత భారం..

సారాంశం

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును 0.50% పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. 

ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ముందుగా ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రపంచ ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రెపో రేటును 0.50 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో రెపో రేటు ఇప్పుడు 4.90 నుంచి 5.40 శాతానికి పెరిగింది. కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని కూడా దాస్ తెలిపారు.

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటును మేలో 0.40 శాతం, జూన్‌లో 0.50 శాతం పెంచింది. రెపో రేటు పెంచడం ఇది మూడోసారి. ఇంతకుముందు రెపో రేటు 4.9 శాతంగా ఉంది, ఇది కోవిడ్‌కు ముందు ఉన్న 5.15 శాతం కంటే తక్కువగా ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక విధానాలను సమీక్షిస్తున్న ప్రతిసారీ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, CRR వంటి పదాలు వస్తాయి. ఇవి సామాన్యులకు అర్థం కావడం కొంచెం కష్టం. రెపో రేటు, రివర్స్ రెపో రేటు , CRR  అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 

దీన్ని సరళమైన భాషలో ఇలా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు మనకు రుణాలు ఇస్తాయి , ఆ రుణానికి మనం వడ్డీ చెల్లించాలి. అదేవిధంగా, బ్యాంకులు కూడా వారి రోజువారీ కార్యకలాపాలకు భారీ మొత్తం అవసరం , వారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి రుణాలు తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ వారి నుండి ఈ రుణంపై వడ్డీని వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు.

రెపో రేటు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది
బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందినప్పుడు అంటే రెపో రేటు తక్కువగా ఉన్నప్పుడు వారు తమ కస్టమర్లకు చౌకగా రుణాన్ని కూడా ఇవ్వవచ్చు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినట్లయితే, బ్యాంకులు రుణాలు తీసుకోవడం ఖరీదుగా మారుతుంది. తమ ఖాతాదారులకు రుణాలపై వడ్డీ రేట్లను పెంచేస్తాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
Gold rate: 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుంది?