ఆర్‌బీఐ గుడ్‌న్యూస్: ఇకపై నో మినిమమ్ బ్యాలెన్స్...వాళ్ల కోసమే

Siva Kodati |  
Published : Jun 11, 2019, 02:50 PM IST
ఆర్‌బీఐ గుడ్‌న్యూస్: ఇకపై నో మినిమమ్ బ్యాలెన్స్...వాళ్ల కోసమే

సారాంశం

పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వరుస పెట్టి ఛార్జీలు, పరిమితులు తదితర చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు

పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వరుస పెట్టి ఛార్జీలు, పరిమితులు తదితర చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది.

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఆర్‌బీఐ ఎత్తివేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీ

నితో పాటుగా నగదు ఉపసంహరణలపై ఉన్న నిబంధనలను సైతం సడలించింది. బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకునే సదుపాయంతో పాటు ఉచిత ఏటీఏం లేదా డెబిట్ కార్డ్ జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు కనీస సదుపాయాలతో పాటు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలను ఉచితంగా పొందే అవకాశం కలగనుంది. అయితే ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు గాను వారి నుంచి మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆర్‌బీఐ పేర్కొంది.

అయితే బేసిక్ సేవింగ్స్ ఖాతా ఉన్న వ్యక్తులు మరి ఏ ఇతర బ్యాంకులోనూ ఖాతాను కలిగి ఉండరాదు. ఒకవేళ ఉన్నట్లయితే దానిని తెరిచిన 30 రోజుల వ్యవధిలోనే ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండా నో ఫ్రిల్ ఖాతాలను తెరవడానికి ముందే.. తనకు ఇతర బ్యాంకుల్లో బేసిక్ సేవింగ్స్ ఖాతా ఏదీ లేదని సంబంధిత బ్యాంకుకు ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేయాల్సి ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?