మోడీకి షాక్: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య రాజీనామా

By Siva KodatiFirst Published Jun 24, 2019, 9:34 AM IST
Highlights

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే గట్టి షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య తన పదవీ కాలానికి ఆరు నెలల ముందే రాజీనామా చేశారు

ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే గట్టి షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య తన పదవీ కాలానికి ఆరు నెలల ముందే రాజీనామా చేశారు.

2017 జనవరి 23న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరారు. విరల్ ఆచార్య పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత న్యూయార్క్‌లోని స్టెర్న్ బిజినెస్ స్కూలులో విద్యార్ధులకు బోధించనున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పదవీ బాధ్యతల నుంచి వైదలగొనున్న సీనియర్ డిప్యూటీ గవర్నర్ ఎస్. విశ్వనాథన్‌ను ప్రభుత్వం మరికొంత కాలం పదవిలో కొనసాగమనే అవకాశం ఉంది. కాగా.. కేంద్రప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా తన పదవీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. 
 

click me!
Last Updated Jun 24, 2019, 9:34 AM IST
click me!