ఆర్బీఐ తీపి కబురు.. తగ్గిన వడ్డీరేట్లు

By telugu teamFirst Published Aug 7, 2019, 12:33 PM IST
Highlights

 ఆర్థిక సంవత్సరంలో మూడో పరపతి సీమక్ష సమావేశం ఇది. స్వల్పకాల రుణ వడ్డీరేటను దీంతో  5.40శాతానికి చేరింది.దీంతో రివర్స్ రెపోరేటు 5.15వద్దకు చేరింది. 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించేసింది. ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు ప్రస్తుత వడ్డీరేట్లను తగ్గింపు మేలు చేస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

ఆర్బీఐ తీపి కబురు తెలియజేసింది. వరసగా నాలుగోసారి రెపో రేటు తగ్గించింది. ఈ సారి 35 బేసిక్ పాయింట్ల మేరకు కొరత విధించింది. ఈ రోజు ద్రవ్య పరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో పరపతి సీమక్ష సమావేశం ఇది. స్వల్పకాల రుణ వడ్డీరేటను దీంతో  5.40శాతానికి చేరింది.

దీంతో రివర్స్ రెపోరేటు 5.15వద్దకు చేరింది. 2020 జీడీపీ వృద్ధి రేటును 7శాతం నుంచి 6.9శాతానికి తగ్గించేసింది. ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహం నింపేందుకు ప్రస్తుత వడ్డీరేట్లను తగ్గింపు మేలు చేస్తుందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌, జూన్‌ మాసాల్లో రెపో రేటును సవరించడం ద్వారా 75 పాయింట్ల మేర కీలక రేట్లలో కోత విధించింది. సెప్టెంబర్‌లో మొదలయ్యే పండుగ సీజన్‌కు ముందే రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గించాలని ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో సంకేతాలు పంపింది. మరోవైపు ఆర్‌బీఐ అందించిన వెసులుబాటును బ్యాంకులు ఎంత మేర తమ ఖాతాదారులకు వర్తింపచేస్తాయనేది వేచిచూడాలి.

click me!