కరోనా కష్టకాలంలో ఆ కంపెనీ ఉద్యోగులకు ప్రోమోషన్లు, ఇంక్రిమెంట్, బోనస్లు

By Sandra Ashok KumarFirst Published Jul 6, 2020, 5:37 PM IST
Highlights

. అయితే ఆర్థిక సేవలందించే ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్ 1న  మా సంస్థ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్ లను ప్రకటించనున్నట్లు ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ పిడబ్ల్యుసి ఇండియా తెలిపింది. 

కోల్‌కతా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న భీభత్సం అంతా ఇంత కాదు. వేతనల్లో కోత, ఉద్యోగాల తొలగింపు, పరిశ్రమల మూత ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసింది. అయితే ఆర్థిక సేవలందించే ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ) సంస్థ మాత్రం ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్‌లతో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

అక్టోబర్ 1న  మా సంస్థ ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్ లను ప్రకటించనున్నట్లు ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ పిడబ్ల్యుసి ఇండియా తెలిపింది.  కరోనా వైరస్ ప్రభావం కారణంగా పిడబ్ల్యుసిలోని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ సంవత్సరం 25% వరకు వేతన కోతలను విధించింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  ఉద్యోగులందరికీ ఇంక్రిమెంట్, ప్రమోషన్లు, బోనస్ చెల్లింపులు వాయిదా పడింది. ప్రతుత ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగుల పనితీరు రేటింగ్‌లు ఇప్పటికే ఉద్యోగులకు తెలిపాము. రేటింగ్‌లును బట్టి వారికి ప్రమోషన్లు, బోనస్లు, ఇంక్రిమెంట్లు అక్టోబర్ 1 న ప్రకటించనున్నారు.

also read 

"ఈ రోజు మేము ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్ చెల్లింపుల గురించి మా ఉద్యోగులకు తెలిపాము. ఈ చర్యల వల్ల మా ఉద్యోగులకు, సంస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలకు సహాయపడతాయని మేము విశ్వసిస్తున్నాము ”అని పిడబ్ల్యుసి ఇండియా చైర్మన్ శ్యామల్ ముఖర్జీ సోమవారం అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నామని, కానీ గత సంవత్సరాలతో పోలిస్తే వేతనాలు, ప్రమోషన్లు కొంత మేర తగ్గవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా సంస్థ క్లయింట్లకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని పీడబ్లుసీ చీఫ్‌ పబ్లిక్‌ అధికారి పద్మజ అలగానందన్‌ తెలిపారు.

మరోవైపు తమ సంస్థ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన రేటింగ్‌ సాధించిందని, సాధారణంగా సంవత్సర-ముగింపు పనితీరు అంచనా ప్రక్రియ మార్చిలో నుండి ప్రారంభంవుతుంది. తుది రేటింగ్‌లు, సంబంధిత ఫలితాలను మే నెలలో ఉద్యోగులకు ప్రకటించినట్లు పిడబ్ల్యుసి ఇండియా చీఫ్ పీపుల్ ఆఫీసర్ పద్మజ అలగానందన్ తెలిపారు.
 

click me!