
మార్కెట్లో ఇప్పటికే చాలా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు మద్యం రేట్లు కూడా భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నార. ముడి సరుకు ధరలు పెరగడం వల్లే ధరల పెంచాలని.. లేదంటే నష్టాలు తప్పవని బీర్ల తయారీ కంపెనీలు వాపోతున్నాయి. బీర్ల రేటును 10 నుంచి 15శాతం మేరకు పెంచాలని బీర్ల తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. బీర్ల తయారీలో వాడే బార్లీ, ఇతర ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మందుబాబులకు ఇది బ్యాడ్‌న్యూస్. మండు వేసవిల్లో చల్లగా కిక్కిచ్చే బీర్ కొండెక్కనుంది. త్వరలో ఒక్కొక్క బీరుపై భారీగానే ధర పెరగనుంది. మందుబాబులు ప్రతి ఒక్కరికీ బీర్ అంటే ఇష్టముంటుంది. అందులో వేసవిలో అయితే ముందుగా ప్రిఫర్ చేసేది బీరే. మండుటెండల్లో చల్లగా లోపలకు దిగుతూ కిక్కిస్తుంటుంది. అందుకే బీర్ అంటే ఇష్టపడనివారుండరు. బార్లీ నేపధ్యం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదనే కాన్సెప్ట్‌తో మరికొందరు ఇష్టపడుతుంటారు. కారణాలేమనుకున్నా.. వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు ఫుల్ డిమాండ్. ఎంత డిమాండ్ అంటే చిల్డ్ బీర్ దొరకని పరిస్థితులుంటాయి.
ఇప్పుడీ వేసవి పూర్తిగా బీర్లతో ఎంజాయ్ చేయకముందే..ఇంకా మే నెల రాకముందే మందుబాబులకు ముఖ్యంగా బీరు బాబులకు షాక్ తగలనుంది. బీర్ ధరల్ని పెంచేందుకు కంపెనీలు సిద్ధమౌతున్నాయి. బీరు తయారీలో ముఖ్యమైన ముడి సరుకు బార్లీ రేట్లు పెరగడం ప్రధాన కారణం. బార్లీ ధర ఈ ఏడాది 65 శాతం పెరిగింది. ఇక దాంతోపాటు రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులు కూడా పెరిగాయి. ఫలితంగా బీర్ ధరల్ని 10-15 శాతం పెంచేందుకు కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అంటే ఒక్కొక్క బీర్‌పై 20-30 రూపాయలు పెరగడం ఖాయం.
గడిచిన ఏడాదిలోనే బార్లీ ధర 65%, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. దీంతో బీర్ల ధరలను కూడా 10 నుండి 15 శాతం ధర పెంచాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీర్ తయారీకి బార్లీ, ర్లీమాల్ట్ అనేవి ముడి పదార్థాలు. బార్లీని అధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా రెండవ స్థానంలో ఉండగా.. ఇక ఉక్రెయిన్ రీ మాల్ట్ ఉత్పత్తిలో ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. ఇప్పుడీ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోన్న కారణంగా ఆ రెండు ముడి పదార్ధాల ధరలకు రెక్కలొచ్చాయి. మనదేశంలోనూ బార్లీ పండుతోంది. చాలా వరకు బ్రూవరీ కంపెనీలు దేశీయ బార్లీతోర్లీనే బీర్లను తయారు చేస్తున్నాయి. కానీ.. అంతర్జాతీయ మార్కెట్లో బార్లీ ధరలు అమాంతం పెరగడంతో ఇక్కడ, దేశీ మార్కెట్లో కూడా ధరలు పెంచేశారు. దాంతో బీర్ల తయారీ కంపెనీలకు తయారీ వ్యయాలు అధికమవుతున్నాయని.. ఫలితంగా ఈ భారాన్నంతా బీరును లొట్టలేట్ట సుకుంటూతాగే వారి నెత్తినే వేసేందుకు బీర్ల కంపెనీలు సిద్ధమవుతున్నాయి.