వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు..

Published : Nov 01, 2022, 08:44 AM ISTUpdated : Nov 01, 2022, 08:52 AM IST
వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు..

సారాంశం

ఈరోజు అంటే నవంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.115 తగ్గింది. అయితే, దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలలో ఈ తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

న్యూఢిల్లీ: అధిక ఇంధన ధరలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు భారీ ఊరటనిచ్చే విధంగా  ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం అంటే నవంబర్ 1 నుంచి కమర్షియల్ ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

దీంతో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు భారీగా పడిపోయాయి. ఈరోజు అంటే నవంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.115 తగ్గింది. అయితే, దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలలో ఈ తగ్గింపు ఉంటుంది. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ డొమెస్టిక్ సిలిండర్ల ధరలో చివరి మార్పు జూలై 6న జరిగింది. 

ఐ‌ఓ‌సి‌ఎల్ ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల ఇండేన్ వాణిజ్య సిలిండర్ ధర నవంబర్ 1 నుండి రూ.115.5 తగ్గింది. కోల్‌కతాలో రూ.113, ముంబైలో రూ.115.5, చెన్నైలో రూ.116.5 కోత విధించారు. అంతకుముందు అక్టోబర్ 1న వాణిజ్య సిలిండర్ల ధర రూ.25 తగ్గింది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది. 

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు
19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1885.5 నుండి రూ. 1744కి తగ్గింది.
కమర్షియల్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1846కి చేరింది. గతంలో దీని ధర రూ. 1995.50. 
ముంబైలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1844కి నుండి రూ.1696కి తగ్గింది. 
ఎల్‌పి‌జి సిలిండర్ ధర ఇప్పుడు చెన్నైలో రూ.1893కి చేరింది. గతంలో దీని ధర రూ. 2009.50.
 

14.2 కిలోల సిలిండర్ ధర
 నగరం       ధర 
కోల్‌కతా     రూ.1079
ఢిల్లీ          రూ.1053
ముంబై     రూ.1052.5
చెన్నై       రూ.1068.5   

ప్రతి నెలా 1వ తేదీన 
దేశంలోని గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ల ధరను నిర్ణయిస్తాయి. కమర్షియల్ ఎల్‌పి‌జి గ్యాస్ ఎక్కువగా హోటళ్లు, ఫుడ్ షాపుల్లో ఉపయోగించబడుతుంది. అయితే వరుసగా ఆరు నెలలుగా కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గడం గమనార్హం. స్థానిక వ్యాట్‌ ఆధారంగా ప్రతి రాష్ట్రానికి ధరలు మారుతూ ఉంటాయి.

PREV
click me!

Recommended Stories

Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్