Post Office Plan: ఈ పోస్టాఫీసు పథకం ద్వారా రూ. 16 లక్షలు పొందే అవకాశం..ఏం చేయాలో తెలుసుకోండి..?

By Krishna Adithya  |  First Published Aug 3, 2023, 5:54 PM IST

మన దేశంలో ఎన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉన్నప్పటికీ ప్రజలు పోస్ట్ ఆఫీస్ లనే ఎక్కువగా నమ్ముతారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది నమ్మకానికి ప్రతిరూపం. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఈ శాఖను నడుపుతుంది. అందుకే ప్రజలు పోస్ట్ ఆఫీసులో తమ సొమ్మును భద్రపరుచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మీరు 16 లక్షల రూపాయలను పోగు చేయాలని ప్లాన్ చేస్తే మాత్రం పోస్ట్ ఆఫీస్ లోని ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది.


పోస్ట్ ఆఫీస్ RD పథకం ప్రస్తుతం డిపాజిటర్లకు 6.2% వడ్డీ రేటును అందిస్తోంది (ఏప్రిల్ 1, 2023 నుండి అమలులో ఉంది). ఈ పథకంలో అనుమతించబడిన కనీస పెట్టుబడి నెలకు రూ. 100 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టగల మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. పోస్ట్ ఆఫీస్ RD పథకంలో డిపాజిట్ ఖాతా తెరిచిన తేదీ నుండి 5 సంవత్సరాలలో (డిపాజిట్ చేసిన 60 నెలల తర్వాత) మెచ్యూర్ అవుతుంది. పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్ ప్రకారం, ఖాతాదారులు సంబంధిత పోస్టాఫీసుకు దరఖాస్తును సమర్పించడం ద్వారా ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించడానికి అనుమతించబడతారు.

నెలకు రూ. 5000 RDలో డిపాజిట్ చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది?
పోస్టాఫీసు RD పథకం కోసం నెలవారీ 5000 రూపాయల డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలలో 3.52 లక్షల రూపాయల కార్పస్‌ మీ చేతిలో ఉంటుంది. మీరు ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే, 10 సంవత్సరాలలో మొత్తం రూ. 8.32 లక్షలు అవుతుంది.

Latest Videos

నెలకు రూ. 1000 RDలో ఎంత ప్రయోజనం ఉంటుంది?
పోస్టాఫీస్ ఆర్‌డి పథకం కోసం నెలవారీ రూ. 1000 డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలలో రూ. 70,431 లక్షల కార్పస్‌ మీ చేతిలో ఉంటుంది. మీరు ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే, 10 సంవత్సరాలలో మొత్తం రూ. 1.66 లక్షలు అవుతుంది.

నెలకు రూ. 10000 RDలో ఎంత ప్రయోజనం ఉంటుంది?
పోస్టాఫీస్ ఆర్‌డి స్కీమ్‌కు నెలవారీ రూ. 10,000 డిపాజిట్ చేస్తే, 5 సంవత్సరాలలో రూ. 7.04 లక్షల కార్పస్‌గా వస్తుందని లెక్కలు వెల్లడిస్తున్నాయి. మీరు ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే, 10 సంవత్సరాలలో మొత్తం రూ.16.6 లక్షలు అవుతుంది.

పోస్టాఫీసు RD ఖాతాను ఎవరు తెరవచ్చు...

పోస్ట్ ఆఫీస్ RD ఖాతాను ఒక వ్యక్తి లేదా జాయింట్ గా (3 మంది పెద్దలు లేదా 10 ఏళ్లు పైబడిన మైనర్) ద్వారా తెరవవచ్చు. మీ సమీపంలోని పోస్టాఫీసు శాఖను వెళ్లి ఆర్డీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు వివరాలను తెలిపిన తర్వాత, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ కూడా  రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) యాప్‌ని ఉపయోగించి, ఎవరైనా ఆన్‌లైన్‌లో RD చెల్లింపు చేయవచ్చు. మీరు వరుసగా నాలుగు వాయిదాలు RD లో డిపాజిట్ చేయకపోతే, ఖాతా మూసివేయబడుతుంది. 

click me!