
భారత తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్‌ను (India International Bullion Exchange, IIBX) ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. గాంధీనగర్ సమీపంలోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ) ప్రధానమంత్రి ఘనంగా ప్రారంభించారు. షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్, బోర్సా ఇస్తాంబుల్ తరహాలో భారత్‌ను గోల్డ్ మార్కెట్లో ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా మార్చేందుకు దీనిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు ఈ బులియన్ ఎక్స్ఛేంజ్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
బులియన్ అంటే ఏమిటి?
కడ్డీలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న అధిక స్వచ్ఛత కలిగిన ఫిజికల్ బంగారం, వెండిని బులియన్ అని అంటారు. బులియన్ కొన్నిసార్లు చట్టబద్ధమైన టెండర్‌గా పరిగణిస్తుంటారు. ఇది తరచుగా సెంట్రల్ బ్యాంకులచే బంగారు నిల్వలుగా ఉంటుంది.
బులియన్ ఎక్స్ చేంజ్ ప్రయోజనం ఏమిటి
మన దేశంలో బంగారం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బంగారాన్ని ప్రభుత్వమే దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. అయితే 1990లలో, నామినేటెడ్ బ్యాంకులు, ఏజెన్సీల ద్వారా బంగారం దిగుమతి చేసుకునేలా నిబంధనలు సరళీకరించారు. ప్రస్తుతం India International Bullion Exchange (IIBX) ద్వారా మొదటిసారిగా నేరుగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఈ ఎక్స్ చేంజ్ ద్వారా బంగారం డిమాండ్ కు తగ్గట్టుగా దిగుమతి చేసుకునే వీుంది. అయితే ఇక్కడ బంగారం కొనుగోలు చేయాలంటే, దీని కోసం స్వర్ణకారులు IIBXలో ఉన్న వ్యాపార సభ్యుని ట్రేడింగ్ భాగస్వామి లేదా క్లయింట్ అయి ఉండాలి. ఫిజికల్ గోల్డ్, సిల్వర్ నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసింది.
డాలర్లలో కూడా ట్రేడింగ్ చేయవచ్చు
IIBX CEO, MD అశోక్ గౌతమ్ ఈ నెల ప్రారంభంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో జరిపిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. ఒకే ఎక్స్ఛేంజ్‌లో కమోడిటీల ట్రేడింగ్‌ను ప్రారంభించడం దీని ఏర్పాటు వెనుక ఆలోచన, ఇది అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్ కాబట్టి, ట్రేడింగ్ జరుగుతుంది. US డాలర్లలో కూడా ఉంటుందని. ఆసియాలో అతిపెద్ద వ్యాపార కేంద్రం IIBX నిలవనుందని తెలిపారు. అయితే పోటీ ధరల కారణంగా అంతర్జాతీయ వ్యాపారులు సైతం IIBX సేవలను ఉపయోగించుకోవడానికి ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇది స్వేచ్ఛా వాణిజ్య జోన్‌గా ఉన్నందున ఎవరూ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇప్పటి వరకు పని ఎలా ఉంది
ప్రస్తుతం, భారతదేశంలోకి బంగారం దిగుమతులు వివిధ నగరాల్లో నియమించబడిన బ్యాంకులు, ఆర్‌బిఐ ఆమోదించిన ఏజెన్సీల ద్వారా జరుగుతాయి. అక్కడి నుంచే వ్యాపారులకు/నగల వ్యాపారులకు సరఫరా అవుతుంది. అయితే బంగారం దిగుమతి చేసుకున్న బ్యాంకులు, ఏజెన్సీలకు ఎగుమతిదారుల నుండి మెయిన్ టెయినెన్స్ పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. దీంతో బ్యాంకులు దేశీయంగా బంగారం కొనుగోలుచేసే బల్క్ డీలర్ల నుంచి ఆ చార్జీలను బంగారంపై ప్రీమియంగా జోడించి రాబడతారు. చివరకు ఈ రుసుమును తుది కస్టమర్‌కు చేరే సరికి మరింత పెరుగుతుంది. అయితే IIBX ద్వారా అర్హతగల దేశీయ కొనుగోలుదారులు GIFT సిటీ శాఖ ద్వారా అంతర్జాతీయ సరఫరాదారు నేరుగా గోల్డ్ బార్‌లు , నాణేలను కొనుగోలు చేయవచ్చు, IIBXలో సభ్యులుగా ఉన్నవారికి ఈ సౌకర్యం కల్పించనున్నారు.
ఏం లాభం..
IIBX వృద్ధి కేవలం GIFT సిటీకి మాత్రమే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆభరణాల తయారీ కేంద్రాలకు విస్తరించే పనిలో ఉంది. ఐఐబీఎక్స్ ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు అర్హత కలిగిన నగల వ్యాపారులు అనుమతిస్తారు. IIBX సభ్యత్వం పొందిన క్లయింట్ లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. జ్యువెలర్స్ ఎక్స్ఛేంజ్‌లో అందుబాటులో ఉన్న స్టాక్‌లను వీక్షించవచ్చు. ఆర్డర్లు చేయవచ్చు. ఇది స్వర్ణకారుల పనిని మరింత సులభతరం చేస్తుంది. ధర. ఆర్డర్ సీక్వెన్సింగ్‌లో పారదర్శకతను తెలుస్తుంది.