సామాన్యులపై తగ్గని ఇంధన ధరల ప్రభావం.. నేడు మీ నగరంలో పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు తెలుసుకోండి..

By asianet news teluguFirst Published May 16, 2023, 10:46 AM IST
Highlights

 ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72 కాగా, నోయిడా ఇంకా  గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే కొంచెం తక్కువగా ఉంది. నోయిడాలో పెట్రోల్ లీటరుకు రూ. 96.53కాగా, గురుగ్రామ్‌లో పెట్రోల్ లీటరుకు రూ. 97.10 వద్ద ఉంది.  
 

భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ 2023లో విడుదల చేసిన డేటా ప్రకారం, దిగుమతి చేసుకున్న ముడి చమురుపై భారతదేశం ఆధారపడటం నిరంతరం పెరుగుతోంది. ఇది 2022-23లో 87.3 శాతం కాగా, 2021-22లో 85.5 శాతం, 2020-21లో 84.4 శాతం. ఇలాంటి  పరిస్థితిలో, భారతదేశం నిరంతరం ఇతర ఇంధన వనరుల కోసం అన్వేషిస్తుంది. భారతదేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాలు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో చాలా కాలంగా పెట్రోల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.

 ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72 కాగా, నోయిడా ఇంకా  గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే కొంచెం తక్కువగా ఉంది. నోయిడాలో పెట్రోల్ లీటరుకు రూ. 96.53కాగా, గురుగ్రామ్‌లో పెట్రోల్ లీటరుకు రూ. 97.10 వద్ద ఉంది.  

మరోవైపు, ఈ రెండు నగరాల్లో డీజిల్ ధరలో స్వల్ప మార్పు కనిపించింది. మే 16న నోయిడాలో డీజిల్ లీటరుకు రూ. 89.93 కాగా, గురుగ్రామ్‌లో డీజిల్ ధరలు 0.12 పైసలు తగ్గిన తర్వాత లీటరుకు రూ. 89.84గా ఉన్నాయి.

పెట్రోల్,  డీజిల్ తాజా ధరలను భారతీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేస్తాయి. దాదాపు ఏడాది కాలంగా దేశంలో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర స్థాయిలో విధించే పన్ను కారణంగా వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 75.75 డాలర్లుగా ఉంది. WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 71.58 వద్ద ఉంది. 

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (మంగళవారం) లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా ఉందని ఐఓసీఎల్ వెల్లడించింది.  దీనితో పాటు, దేశ ఆర్థిక రాజధాని ముంబై గురించి మాట్లాడుతూ, ఇక్కడ పెట్రోల్ లీటరుకు రూ. 106.31, డీజిల్ లీటరుకు రూ. 94.27 వద్ద స్థిరంగా ఉంది.  

అంతేకాకుండా, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ ధర రూ.92.76. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

click me!