స్థిరంగా పెట్రోల్ - డీజిల్ ధరలు.. నేడు హైదరాబాద్ లో లీటరు ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Sep 30, 2022, 9:34 AM IST
Highlights

గత నాలుగు నెలల క్రితం ప్రభుత్వం పెట్రోల్ - డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ఇంధన ధరలు దిగోచ్చాయి.  అలాగే సెప్టెంబర్ 1న చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి.

క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం బ్యారెల్‌కు 100 డాలర్ల కిందకు పడిపోయాయి. మరోవైపు ఇండియాలో పెట్రోలు-డీజిల్ ధరలు 132 రోజులుగా స్థిరంగా ఉండగా, చాలా దేశాల్లో పెట్రోల్ ధర చౌకగా మారింది.  నేపాల్‌లో లీటరు పెట్రోల్ ధర జూన్ 20తో పోలిస్తే 26 సెప్టెంబర్ 2022న భారతీయ రూపాయలలో రూ.113.30కి చేరింది.

రేపు గ్యాస్ ధరలో మార్పు 
గత నాలుగు నెలల క్రితం ప్రభుత్వం పెట్రోల్ - డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత ఇంధన ధరలు దిగోచ్చాయి.  అలాగే సెప్టెంబర్ 1న చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. అక్టోబరు 1న కూడా గ్యాస్ ధరలో మార్పు ఉంటుందని అంచనా.

WTI క్రూడ్ తాజా రేటు బ్యారెల్‌కు 81.42 డాలర్లకు స్వల్పంగా పెరిగింది.  బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 88.51 వద్ద ఉంది. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు జరిగింది. అయితే మేఘాలయలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధర ఒకటిన్నర రూపాయలు పెరిగింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు విధిస్తున్నాయి. 

నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ లీటర్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.  కోల్‌కతాలో గురువారం లీటరు పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

click me!