petrol diesel price today:పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Jan 7, 2022, 10:49 AM IST
Highlights

పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు నేటికీ ఎలాంటి మార్పు చేయలేదు. గత నెల రోజులకు పైగా  ఇంధన ధరలు నేటికీ నిలకడగా ఉన్నాయి. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు ధర ఇప్పటికీ రూ.100 పైనే కొనసాగుతోంది. 

నేడు ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో  నేటికీ ఎలాంటి మార్పు చేయలేదు. గత కొద్ది రోజులుగా నిలకడగా కొనసాగుతున్న ఇంధన ధరలు సామాన్యులకి కాస్త ఊరటనిస్తున్నాయి. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ పెట్రోలు ధర రూ.100 పైనే కొనసాగుతోంది.  

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (VAT)ని తగ్గించాలని నిర్ణయించడంతో  ఇంధనం ధర లీటరుకు రూ. 8 తగ్గింది. దీంతో ఇంధన ధరలు ఇతర మెట్రో నగరాల కంటే ఇక్కడ చాలా చౌకగా మారాయి. ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పెట్రోల్‌పై వ్యాట్‌ను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుండి 19.4 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. వ్యాట్ తగ్గింపు తర్వాత పెట్రోల్ ధర లీటరుకు ప్రస్తుతం ఉన్న రూ.103 నుంచి రూ.95కి దిగోచ్చింది.

గత ఏడాది దీపావళి సందర్భంగా కేంద్రం ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును ప్రకటించింది, ఫలితంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తార స్థాయి నుండి  భారీగా తగ్గాయి. ప్రభుత్వం పెట్రోల్ ధరపై రూ. 5, డీజిల్ ధరపై రూ. 10 తగ్గించింది. ఈ నిర్ణయం తర్వాత చాలా రాష్ట్రాలు, ఎక్కువగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఇంకా మిత్రపక్షాలు కూడా పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాయి. 

1.  ముంబై పెట్రోలు  ధర లీటరుకు రూ. 109.98, డీజిల్ ధర  రూ. 94.14

2.  ఢిల్లీ పెట్రోలు ధర  రూ. 95.41, డీజిల్ ధర రూ. 86.67

3.  చెన్నైపెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ ధర  రూ.91.43

4.  కోల్‌కతా పెట్రోలు ధర లీటరుకు రూ. 104.67, డీజిల్ ధర  రూ. 89.79

5.  భోపాల్ పెట్రోల్ ధర  రూ.107.23, డీజిల్ ధర  రూ.90.87

6.  హైదరాబాద్ పెట్రోల్ ధర  రూ.108.20, డీజిల్ ధర రూ.94.62

7.  బెంగళూరు పెట్రోలు ధర రూ.100.58, డీజిల్ ధర  రూ.85.01

8.  గౌహతి పెట్రోలు ధర  రూ. 94.58, డీజిల్ ధర  రూ. 81.29

9.  లక్నో పెట్రోలు - రూ. 95.28 లీటర్ డీజిల్ - రూ. 86.80

10.  గాంధీనగర్ పెట్రోలు ధర  రూ. 95.35, డీజిల్ ధర  రూ. 89.33

11.  తిరువనంతపురం పెట్రోల్ ధర  రూ.106.36, డీజిల్ ధర రూ.93.47


మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోవడానికి  మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది,  

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేటును నిర్ణయిస్తాయి.  

click me!