వాహనదారులకు షాక్.. రూ.71కి చేరువలో పెట్రోల్ ధర

Published : Feb 18, 2019, 12:27 PM IST
వాహనదారులకు షాక్.. రూ.71కి చేరువలో పెట్రోల్ ధర

సారాంశం

వాహనదారులకు మరోసారి పెట్రో షాక్ తగిలింది. కాస్త తగ్గినట్టే తగ్గి.. మరోసారి పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

వాహనదారులకు మరోసారి పెట్రో షాక్ తగిలింది. కాస్త తగ్గినట్టే తగ్గి.. మరోసారి పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71కి చేరింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం.. ఢిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.70.91కి చేరగా... లీటర్ డీజిల్ ధర రూ.66.11కి చేరింది. ఇక ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.54గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.69.23కి చేరింది.

కోల్ కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.01గా ఉండగా.. చెన్నైలో రూ.73.61కి చేరింది. డీజిల్ ధర కోల్ కత్తాలో రూ.67.89గా ఉండగా.. చెన్నైలో రూ.69.84కి చేరింది. గతేడాది చివరితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దిల్లీలో పెట్రోల్‌ ధరపై రూ. 2.05, డీజిల్‌ ధరపై రూ. 3.25 పెరిగింది.

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే