
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు శుక్రవారం (మార్చి 25, 2022) మరోసారి పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగింది.తెలంగాణ హైదరాబాద్‌లో శుక్రవారం పెట్రోల్ ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110.91 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో డీజిల్ రేటు రూ. 97.23 వద్ద కొనసాగుతోంది. ఏపీ విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76 వద్ద కొనసాగుతోంది. డీజిల్ లీటర్ ధర రూ. 98.74గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలివే..!
- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.85 కాగా, డీజిల్ రూ. 89.11 వద్ద కొనసాగుతోంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.49 కాగా, డీజిల్ రూ. 96.68గా ఉంది.
- చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.65 కాగా, డీజిల్ రూ. .93.7గా నమోదైంది.
- బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 103.11 కాగా, డీజిల్ రూ. 87.37 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.18 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.22గా ఉంది.
- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 97.65 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.2గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.91 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 97.23గా ఉంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ. 112.96 ఉండగా.. డీజిల్ రూ. 98.94కు చేరింది.
- విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ. 111.66కాగా, డీజిల్ రూ. 97.68కి చేరింది.
పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.