Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 09:51 AM ISTUpdated : Jan 27, 2022, 09:53 AM IST
Petrol Diesel Prices Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

సారాంశం

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 27, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. 

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 27, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే ఉంది. దీంతో గురువారం కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవాలి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి మార్పు లేకుండా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కూడా ధరల్లో వ్యత్యాసం లేదని చెప్పుకోవచ్చు.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

 - ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.  

PREV
click me!

Recommended Stories

Post office: మీరు ఏం చేయకపోయినా రూ. 2 లక్షలు మీ సొంతం.. ఈ పథకం గురించి తెలుసా.?
Business Ideas: ప‌నికి రాని పాత వైర్లతో ల‌క్ష‌ల సంపాద‌న‌.. మీ జీవితాన్ని మార్చే బిజినెస్‌