
ఒక రోజు ఉపశమనం తర్వాత నేడు ఇంధన ధరలు మళ్లీ ఎగిశాయి. పెట్రోల్ ధర లీటరుకు 76 నుంచి 85 పైసలకు పెరగగా, డీజిల్ ధర కూడా 76 నుంచి 85 పైసలకు పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.102.61గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ.93.87గా లభిస్తోంది.
ముంబైలో పెట్రోలు ధర రూ.117.57 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.101.79గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.112.19 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.97.02. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.108.21, డీజిల్ రూ.98.28గా ఉంది. గతేడాది నవంబర్ 4 నుంచి మార్చ్ వరకు ఇంధనాల ధరల్లో ఎలాంటి పెంపుదల లేదు.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకుందని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ముంబైలో పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థలు మార్చి నెలలో 2.69 మిలియన్ టన్నుల పెట్రోల్‌ను విక్రయించాయి. గతేడాది కాలంతో పోలిస్తే 8.7 శాతం, 2019తో పోలిస్తే 14.2 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో ఈ సంస్థల వాటా ఏకంగా 90 శాతం ఉంది. డీజిల్ విక్రయాలు 10.1 శాతం పెరిగి 7.05 మిలియన్ టన్నులుగా ఉంది. 2019 మార్చితో పోలిస్తే 5 శాతం ఎక్కువ. మార్చి 1–15 మధ్య అమ్మకాలు పెట్రోల్ 18 శాతం, డీజిల్ 23.7 శాతం దూసుకెళ్లాయి. 2020తో పోలిస్తే గత నెలలో జరిగిన విక్రయాలు పెట్రోల్ 38.6 శాతం, డీజిల్ 41.6 శాతం అధికం. మరోవైపు విమానాల్లో వాడే ఇంధనం 9.8 శాతం పెరిగి మార్చిలో 4,91,200 టన్నులకు చేరింది. కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే 27.6 శాతం వెనుకబడి ఉంది. 2020 మార్చితో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ కావడం విశేషం. ఎల్‌పీజీ అమ్మకాలు 12 శాతం అధికమై గత నెలలో 2.53 మిలియన్ టన్నులకు చేరింది.
మీరు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఇంధన ధరలను తెలుసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది, మీరు ఈ కోడ్ ని IOCL వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.
పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతుంటాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.