పెట్రోల్-డీజిల్ ధరలపై వాహనదారులకు బిగ్ రిలీఫ్.. నేడు హైదరాబాద్ లో లీటరు ధర ఎంతంటే ?

By asianet news teluguFirst Published Nov 9, 2022, 9:23 AM IST
Highlights

నేడు బీహార్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.66కు చేరగా, డీజిల్‌ రూ.96.28కి చేరింది. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.49కి, డీజిల్ రూ.89.66కి పెరిగింది.  రాజస్థాన్‌లో కూడా ధరలు పెరిగాయి, 

న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95.36 డాలర్లకు తగ్గగా, డబ్ల్యూటీఐ ధర బ్యారెల్‌కు 87.82 డాలర్లకు పడిపోయింది. మరోవైపు దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌పై కొత్త ధరలను విడుదల చేశాయి. దీంతో నేడు కొన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరిగాయి.  ప్రముఖ మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.

నేడు బీహార్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.66కు చేరగా, డీజిల్‌ రూ.96.28కి చేరింది. అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.49కి, డీజిల్ రూ.89.66కి పెరిగింది.  రాజస్థాన్‌లో కూడా ధరలు పెరిగాయి, ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20, డీజిల్ లీటర్‌కు రూ.93.47 చేరుకుంది. మరోవైపు గుజరాత్, మధ్యప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో ధరలు స్వల్పంగా తగ్గాయి.

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర  రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ . 89.82
- ముంబైలో పెట్రోల్ ధర  రూ. 106.31, డీజిల్ ధర  రూ. 94.27
 - చెన్నైలో పెట్రోల్ ధర  రూ. 102.63, డీజిల్ ధర  రూ.94.24
- కోల్‌కతాలో  పెట్రోల్ ధర  రూ. 106.03, డీజిల్ ధర  లీటరుకు రూ. 92.76

ఈ నగరాల్లో ఇంధన ధరలు మారాయి
- నోయిడాలో పెట్రోల్ ధరరూ. 96.92, డీజిల్ ధర లీటరుకు రూ. 90.08.
-లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
-పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.59, డీజిల్ ధర రూ.94.36కు చేరింది.
- ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.89.75గా ఉంది.
-హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

ఉదయం 6 గంటలకు కొత్త ధరలు  జారీ 
పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలు సమీక్షిస్తారు అలాగే కొత్త ధరలు జారీ చేస్తారు.

click me!