పెట్రోల్-డీజిల్ కొత్త ధరలు ఇవే.. నేటికీ 6 నెలల పాటు నిలకడగా ఇంధన ధరలు..

By asianet news teluguFirst Published Nov 21, 2022, 9:15 AM IST
Highlights

గత ఐదు నెలలకు పైగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండడం ఇదే తొలిసారి. మే 22న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు దిగోచ్చాయి.

 ఈ రోజున అంటే 21 నవంబర్ 2022 నాటికి  ఆరు నెలలు కావస్తున్నా ఇండియాలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.  అయితే చివరిసారిగా మే 22న పెట్రోల్, డీజిల్ ధరల్లో వాహనదారులకు ఉపశమనం లభించింది.  నేడు  దేశంలోని అన్నీ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అధికారిక వెబ్‌సైట్ iocl.com తాజా అప్‌డేట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72, ఒక లీటర్ డీజిల్ ధర రూ. 89.62, ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ రూ.94.27గా ఉంది.

మే 22 నుండి ఇంధన ధరల తగ్గింపు
గత ఐదు నెలలకు పైగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండడం ఇదే తొలిసారి. మే 22న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు దిగోచ్చాయి.

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96.  ఘజియాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.96.58, డీజిల్ ధర లీటర్‌కు రూ.89.75 వద్ద స్థిరంగా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర లీటరుకు రూ.90.05గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 కాగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.  

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్‌ ధరని బట్టి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సమీక్షించిన తర్వాత ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. అయితే చాలా కాలంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు.

రాష్ట్ర స్థాయి పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర నేడు కాస్త  తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 90 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 95  డాలర్లకి దగ్గరగా ఉంది.

హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.

click me!