petrol, diesel prices:ఆగష్టు 15న పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. నేడు లీటరు ధర ఎంతంటే..?

By asianet news teluguFirst Published Aug 15, 2022, 9:39 AM IST
Highlights

ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు 100 డాలర్లుగా ట్రేడవుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), iocl.com అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు 15 ఆగస్టు 2022న కూడా దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ. 96.72గా, అయితే ఒక లీటర్ డీజిల్ ధర  రూ. 89.62. స్థిరంగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మెత్తబడినప్పటికీ ప్రభుత్వ చమురు కంపెనీలు సోమవారం 85వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను మార్చలేదు. అయితే ఈ మధ్య కొన్ని చోట్ల సీఎన్‌జీ ధర పెరిగింది. ప్రస్తుతం జైపూర్‌లో పెట్రోల్ ధర రూ.108.48గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.93.72గా ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 22 నుండి పెరగడం ప్రారంభించాయి. 

ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు 100 డాలర్లుగా ట్రేడవుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), iocl.com అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు 15 ఆగస్టు 2022న కూడా దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ రూ. 96.72గా, అయితే ఒక లీటర్ డీజిల్ ధర  రూ. 89.62. స్థిరంగా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు రూ.106.31, డీజిల్ రూ.94.27 చొప్పున విక్రయిస్తున్నారు. పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ లీటరు ధర అతితక్కువగా రూ.84.10గా, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24కు గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల మధ్య జాతీయ స్థాయిలో మే 21 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం స్థిరంగా ఉన్నాయి. 

ప్రముఖ నగరాల్లో చమురు ధరలు..

జైపూర్
పెట్రోల్ లీటరు రూ.108.48
డీజిల్ లీటరు రూ.93.72
 
నోయిడా
పెట్రోలు లీటరు రూ.96.57
డీజిల్ లీటరు రూ. 89.96

భోపాల్
పెట్రోలు లీటరు రూ.108.65
డీజిల్ - లీటరుకు రూ.93.90

- ఢిల్లీలో పెట్రోల్  ధర రూ. 96.72, డీజిల్ లీటరుకు రూ. 89.62 
- ముంబైలో పెట్రోలు ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03,  డీజిల్ లీటరుకు రూ. 92.76

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66,  డీజిల్ ధర రూ. 97.82.

పెట్రోల్, డీజిల్  కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడానికి ఇదే కారణం.అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఆధారంగా, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు.  

click me!